కోవర్టులను ఏరి వేస్తాను.. పని చేసే నాయకులకు మాత్రమే ప్రాధాన్యం.. పని చేయని నాయకులను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తానని చంద్రబాబు సీరియస్‌గానే చెపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పని చేయని, పని దొంగలు అయిన నేతల విషయంలో చూసీ చూడనట్టుగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు వారిని పక్కన పెట్టేస్తున్నారు. 13 జిల్లాల్లో నేతల పనితీరు ఆధారంగానే వారికి పదవులు ఇస్తూ వస్తున్నారు.

తాజాగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే గా ఉన్న శంకర్ యాదవ్‌ను కూడా పక్కన పెట్టేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం శంకర్ యాదవ్ అసలు నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు కేడర్ ను కూడా పట్టించుకోలేదు. ఆ నియోజకవర్గంలో మంచి పేరున్న మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు లక్ష్మీదేవమ్మలను పార్టీలోకి తీసుకు వచ్చి బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

అయితే శంకర్ యాదవ్ తాను కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పటి వరకు పార్టీ నేతలకు టచ్‌లో లేనని.. ఇకపై ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటానని చెప్పారు. తన తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో పాటు కరోనా, లాక్‌డౌన్ వల్ల నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని.. ఇకపై తాను యాక్టివ్‌గా ఉంటానని.. తనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని శంకర్ బాబును వేడుకున్నారు. దీంతో బాబు ఆయన్నే ఇన్‌చార్జ్‌గా కొనసాగించడంతో పాటు మూడు నెలల పాటు టైం ఇచ్చారు.

ఈ మూడు నెలల్లో కూడా మార్పు రాకపోతే ఇన్‌చార్జ్‌ను మార్చేస్తానని బాబు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. మరి శంకర్‌కు చంద్రబాబు ఇచ్చిన ఛాన్స్ ఉపయోగించుకుంటారో ? లేదో ? ఆయన పనితీరు మీదే ఆధార పడి ఉంది.

Discussion about this post