టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న జిల్లాల యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఆయన ఎక్కడి కి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎవరికి వారు.. చంద్రబాబు రాకకోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాల్లో పార్టీనిగాడిలో పెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ఈ యాత్రలు సక్సెస్ రేటును పెంచుతున్నాయ నడంలో సందేహం లేదు. అంతేకాదు.. ఈ జిల్లాల యాత్రలు సక్సెస్ కావడానికి ప్రధానంగా మూడు రీజన్లు ఉన్నాయి. ఈ మూడు కారణాలతో ప్రజలు చంద్రబాబు వెంట నడిచేందుకు రెడీ అవుతున్నారు.

రీజన్ -1
చంద్రబాబు చేపట్టిన జిల్లాల యాత్రలు సరైన టైమింగ్‌లో ప్రారంభించడం. అంటే.. ప్రస్తుతం వైసీపీ స ర్కారు విధానాలతో ప్రజలు విసిగిపోయారు. ఇదేసమయంలో ప్రభుత్వం పన్నులు సహా ఇతర భారాలు మోపడాన్ని ప్రజలు సహించలేక పోతున్నారు. ఇలాంటి సమయంలో తమ గోడును వెలిబుచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారా? అనివారు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో బాబు ముందుకు రావడం కలిసి వచ్చింది.

రీజన్-2
సెంటిమెంట్. చంద్రబాబు ఈ వయసులో కూడా జనాల మధ్యకు రావడాన్ని.. ప్రజలు సెంటిమెంటుగా తీసుకుంటున్నారు. ప్రజలపై ఎంత ప్రేమ ఉంటే తప్ప.. ఇలా ఎందుకు ముందుకు వస్తారని.. ఈ వయ సులో ఆయనకు ఇంకేం అవసరం ఉంటుందని కూడా అంటున్నారు. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమం త్రిగా ఉన్న చంద్రబాబుకు సీఎం సీటు కోత్తకాదని.. కేవలం ఆయన రాష్ట్రం కోసమే తపిస్తున్నారని… ప్రజలు చర్చించుకుంటున్నారు.

రీజన్-3
చంద్రబాబు పర్యటన సక్సెస్ కావడానికి ఆయన వేసిన అద్భుతమైన ప్రణాళిక కూడా కారణమని అంటు న్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతోందని.. చంద్రబాబు సంకేతాలు పంపిం చారు. దీనివల్ల.. ఇప్పటి వరకు నిద్రాణ వ్యవస్థలో ఉన్న నాయకులు ముందుకుకదిలారు. ఏమాత్రం తేడా వచ్చినా.. తాము యాక్టివ్‌గా లేమని సంకేతాలు వచ్చినా..చంద్రబాబు. వెంటనే ఈ సీటను వేరే పార్టీకి కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి నయానో.. భయానో.. నాయకులు అయితే.. కదులుతున్నారు. దీంతో చంద్రబాబు టూర్ సక్సెస్ అవుతోందని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post