మొత్తానికి చాలా రోజుల తర్వాత గుడివాడలో చంద్రబాబు అడుగు పెడుతున్నారు…గుడివాడ నియోజకవర్గం ఎప్పుడైతే వైసీపీ చేతుల్లోకి వెళ్ళిందో..అప్పటినుంచి అక్కడ టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి…టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన కొడాలి నాని…వరుస పెట్టి 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించి…రెండున్నర ఏళ్ళు మంత్రిగా కూడా పనిచేశారు. ఇక మంత్రిగా పనిచేసినప్పుడు..ఆయన ఏ విధంగా చంద్రబాబు, లోకేశ్ లని టార్గెట్ చేసి బూతులు తిట్టారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఆయన అదే పనిలో ఉన్నారు.

అయితే ఇలా బూతులు తిడుతున్న నానికి చెక్ పెట్టాలని టీడీపీ శ్రేణులు గట్టిగానే కష్టపడుతున్నాయి. ఈ సారి గుడివాడలో నానిని ఓడించాలనే కసితో ఉన్నాయి. అయితే నాని అధికార బలం ముందు టీడీపీ బలం సరిపోవడం లేదు. ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు సైతం అంత ఎఫెక్టివ్ గా పనిచేయట్లేదు. కానీ ఇటీవల కాలంలో నానిపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది…ఇంతకాలం అధికారంలో లేమని పని చేయకుండా నాని తప్పించుకున్నారు.కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే గుడివాడకు ఏం చేయట్లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే అంశం నానికి బాగా నెగిటివ్ అవుతుంది…ఈ సారి గుడివాడ ప్రజలు నాని వైపు నిలబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి..పైగా సొంత పార్టీ కార్యకర్తలే…ఈ సారి మా నాని అన్న గెలవడం కష్టమని మాట్లాడుకుంటున్నారు. అంటే గుడివాడలో నాని పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఇదే సమయంలో గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ ఇవ్వనున్నారు…ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29న గుడివాడలో మహానాడు కార్యక్రమం పెట్టనున్నారు. గుడివాడలో భారీ బహిరంగ సభ పెట్టి…గుడివాడలో టీడీపీ సత్తా తగ్గలేదని రుజువు చేయనున్నారు. అలాగే అదే ఊపుతో నెక్స్ట్ ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ జెండా ఎగిరేలా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరి చూడాలి బాబు ఎంట్రీతోనైనా గుడివాడలో టీడీపీ తలరాత మారుతుందేమో.
Discussion about this post