టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ పెరిగింది. ఈ విషయంలో ఎలాంటి తేడా కూడా లేదు. అంచనాలకు మించి వచ్చిన కేడర్‌తో మహానాడు జోష్ పుంజుకుంది. ఇదంతా.. కూడా చంద్రబా బుకు ప్లస్‌గా మారింది. ఎందుకంటే.. మహానాడు కోసం.. పల్లెలు.. పట్నాల్లో గతంలోనూ ఇంతకన్నా.. ప్రచారం ఎక్కువే చేశారు. అయితే.. అప్పట్లో రాని ఇమేజ్.. ఇప్పుడు వచ్చింది. దీనికి కారణం.. చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకం.. విశ్వాసం అంటున్నారు మేధావులు.

నిజానికి గత రెండేళ్లపాటు కరోనా నేపథ్యంలో మహానాడును నిర్వహించలేదు. కానీ, దానికి ముందు.. ఎన్ని కల నేపథ్యంలో వాయిదా వేశారు.. దదీనికిముందు.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు… మహానాడు నిర్వ హించారు. అయితే.. అప్పట్లలో ఇంత స్పందన రాలేదు. అంటే.. దాదాపు మూడేళ్ల తర్వాత.. మహానాడు కు ప్రజలు పోటెత్తారు. ఈ పరిణామాలనను విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఇంత సంఖ్యలో జనాలు ఎందుకు వచ్చారు అంటే..చంద్రబాబు కోసమేనని చెబుతున్నారు.చంద్రబాబును బలపరచాలనే ద్రుఢ విశ్వాసం ప్రజల్లో కనిపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే.. ఏపీ ప్రజలకు సెంటిమెంటు ఎక్కువ. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటే.. పడిపోయారు. జగన్‌కు అధికారం ఇచ్చారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు ఒక్క ఛాన్స్ అనలేదు. అయినా.. కూడా ప్రజలు ఆయన పట్ల అభిమానం పెంచుకుంటున్నారు. దీనికి కారణం.. 70 +లోనూ.. ఆయన రాష్ట్రం కోసం తపిస్తున్నారు. 70+ లోనూ.. ఉద్యమాలకు రెడీ అంటూ..నవ యువకుడిగా బయటకు వస్తున్నారు.

ఎక్కడ ఏం జరిగినా.. నేనున్నానంటూ.. ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ తరహా నాయకుడిని ప్రజలు ఏపీలో ఇప్పటి వరకు చూడలేదు. ఇదే సెంటిమెంటుగా మారింది. మారుతోంది. జగన్ పోవాలి.. అని అనని వారు… అనలేని వారు కూడా.. ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. చంద్రబాబు రావాలి.. కావాలి.. అంటున్నారని.. విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి.. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న సెంటిమెంటు మరింత బలపడుతోందని చెబుతున్నారు. ఈ పరిణామాలు..వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సానుకూల సంకేతాలు ఇస్తున్నాయని అంటున్నారు.

Discussion about this post