యువతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అదేసమయంలో సీనియర్ల విషయంపై కూడా దృష్టి పెట్టి నట్టు తెలుస్తోంది. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంలో.. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లను యువతకు కేటాయిస్తానని.. యువ తను ముందుకు నడిపిస్తామని.. యువరక్తం పారిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నేతల మద్య అనేక సందేహాలు వచ్చాయి. మరి సినీయర్ల మాటేంటని.. అనేకమంది చెవులు కొరుక్కున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు.. సీనియర్లకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.. దీనిని ఆయన ఇప్పటికే మదింపు కూడా చేశారని సీనియర్లు భావిస్తున్నారు.

ప్రతి నియోజకవర్గాన్ని సీనియర్లకు అప్పగిస్తారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మేనిఫెస్టోను తీసుకువస్తారు. దీనికి అనుబంధంగా.. సీనియర్లతో నియోజకవర్గాల వారిగా అక్కడ ఉన్న సమస్యలు.. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు కోరుకుంటున్న డిమాండ్లను అనుసరించి.. నియోజకవర్గాల వారీగా.. కూడా మేనిఫెస్టోలను తయారు చేయించాలని నిర్ణయించారు.

మరీ ముఖ్యంగా టీడీపీ ఎక్కడ వీక్‌గా ఉందో ఆయా జిల్లాల్లో పార్టీనిబలోపేతం చేసేందుకు చంద్రబాబు ఈ మేనిఫెస్టోలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇది కార్యరూపం దాల్చిన తర్వాత.. జిల్లా స్థాయిలోనూ మేనిఫెస్టోలను రూపొందిస్తారు. ఇదే సమయంలో పార్లమెంటు జిల్లాల్లోనూ.. ఇప్పటికే ఉన్న ఇంచార్జలతో ఆయా నియోజకవర్గాల ప్రజల సమస్యలు.. డిమాండ్లు.. సుదీర్ఘ కాలంగా ఉన్న పెండింగు సమస్యలపై చంద్రబాబు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పార్లమెంటు స్థాయిలో సమస్యలపైనా.. వీరి నుంచి నివేదికలు తీసుకుని.. జిల్లాలు, నియోజకవర్గాలు.. వారిగా.. మేనిఫెస్టోలను రూపొందించే బాధ్యతలను సీనియర్లకు అప్పగించడంతోపాటు.. ప్రచార కమిటీల్లోనూ.. అధ్యయన బృందాల్లోనూ వీరికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు సీనియర్లు చెబుతున్నారు. అయితే.. వీరికి ఎమ్మెల్సీలుగా.. రాజ్యసభ సభ్యులుగా తర్వాత.. ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతానికి మాత్రం ఎక్కడైతే.. టికట్లు దక్కకవో.. అక్కడ సీనియర్లు పార్టీ గెలుపుకోసం.. పనిచేయాల్సి ఉంటుందని.. అందరికీ న్యాయం చేసే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
Discussion about this post