వచ్చే ఎన్నికల్లో టీడీపీలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని…చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతే కాదు.. వారికి 40 శాతం టికెట్లు కూడా ఇస్తామన్నారు. అయితే.. ఈ విషయంలో పార్టీ ముఖ్యనేతలు అంత ర్మథనం చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ బలమైన పోరాటం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా అ త్యంత బలంగా ఉన్న వైసీపీని ఎదిరించి.. అధికారంలోకి రావాలి. ఇది సాధించేందుకు.. చాలా వ్యూహాత్మ కంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

ప్రజలను మెప్పించాలి.. మెరుగైన విధంగావారిని ఆకట్టుకోవాలి. అంతేకాదు… పంచ్‌లతో ఇరగదీయాలి.. సవాళ్లకు ప్రతిసవాళ్లు రువ్వాలి. కౌంటర్లకు ప్రతి కౌంటర్లు వేయాలి. ఇవన్నీ ఉండడంతోపాటు.. అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం యువతకు ఉండాలి. సీనియర్లను మెప్పించాలి.. జూనియర్లను కలుపుకో వాలి. ఇవన్నీ చేయగల యువ నాయకులు నూటికి 40 మంది దొరుకుతారా? అనేది ప్రధాన సమస్య. ఎందుకంటే.. ఇప్పుడున్న నాయకుల్లో చరిత్ర పెద్దగా తెలియదు. ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదు.

ప్రజలను ఏవిధంగా తమవైపు తిప్పుకోవాలో.. కూడా అర్ధం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే యువతకు ప్రాధాన్యం ఇస్తే.. మంచిదేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. చంద్రబాబు హామీ ఇచ్చారు కాబ ట్టి.. యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని కొన్ని వర్గాలుపట్టుబడుతున్నాయి. అందుకే., వచ్చే ఏడాది పాటు.. నియోజకవర్గాల్లో పర్యటించి.. ఆయా వర్గాల అభిప్రాయాలు తెలుసుకునేలా.. నియోజకర్గంలోని సమస్యలు.. గత చరిత్రపై పట్టు సాధించేలా.. వ్యూహాత్మకంగా యువతను అడుగులు వేయించాలని చం ద్రబాబు భావిస్తున్నారు.

ఈ క్రమంలో త్వరలోనే ఎవరికీ టికెట్లు ప్రకటించకుండానే వారిని నియోజకవర్గాల్లో పర్యటనలకు పంపించాలని .. భావిస్తున్నారట. ఈ క్రమంలో వారికి కొన్ని సమస్యలు అప్పగించి.. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే చర్యలు చేపట్టాలని.. చంద్రబాబు నిర్ణయించు కున్నారు. తద్వారా వచ్చే ఫలితాన్ని బట్టి.. యువతకు టికెట్లు ఇవ్వడమా? వద్దా.? ఇస్తే.. ఎంతమందికి ఇవ్వాలి? అని నిర్ణయించుకుంటారని తెలుస్తోంది.

Discussion about this post