టిడిపి అధినేత చంద్రబాబు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు…తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. అసలు పార్టీని పట్టించుకోకుండా ఉన్న నేతలని పక్కనబెట్టడానికి మొహమాటం పడటం లేదు. ఇప్పటికే అనేకసార్లు చెప్పినా సరే కొన్ని నియోజకవర్గాల్లో నేతలు, పార్టీని బలోపేతం చేయలేకపోయారు. ఈ క్రమంలోనే చంద్రబాబు…పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని మార్చేశారు.

ఈ క్రమంలోనే టిడిపికి కంచుకోటగా ఉన్న మాడుగులలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని సైడ్ చేసి…పీవీజీ కుమార్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే గవిరెడ్డిని పక్కనబెట్టడానికి కారణాలు లేకపోలేదు. మామూలుగా మాడుగుల టిడిపి కంచుకోట. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు గెలిచింది. 2004లో ఓడిపోగా, 2009లో మరొకసారి గెలిచింది. అప్పుడు టిడిపి తరుపున గవిరెడ్డి రామానాయుడు గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు.

ఇలా రెండు సార్లు ఓడిపోయినా సరే గవిరెడ్డి టిడిపిని బలోపేతం చేసే కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. పైగా ఇక్కడ గ్రూపు తగాదాలు ఎక్కువ అయిపోయాయి. ఇక గవిరెడ్డి నియోజకవర్గంలో ఎక్కువ అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. వరుసగా చంద్రబాబు, గవిరెడ్డికి అవకాశాలు ఇచ్చినా సరే ఉపయోగించుకోలేదు. రెండు సార్లు పార్టీ ఓటమికి కారణమయ్యారు.

గవిరెడ్డి సొంత తప్పిదాలు వాళ్లే మాడుగులలో టిడిపికి ఈ పరిస్తితి వచ్చిందని తెలుస్తోంది. అందుకే గత కొన్ని రోజులుగా మాడుగుల నియోజకవర్గంపై అచ్చెన్నాయుడు సమీక్షలు నిర్వహించి, గవిరెడ్డి వల్ల పార్టీకి నష్టమే అని చెప్పి, పీవీజీ కుమార్‌ని ఇంచార్జ్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

మరి కుమార్ ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తారో రానున్న రోజుల్లో చూడాలి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాంటి నాయకుడుకు చెక్ పెట్టడమనేది కాస్త కష్టమే. మరి కుమార్ మాడుగులలో టిడిపిని బలోపేతం చేసి వైసీపీ ఎలా చెక్ పెడతారో చూడాలి.

Discussion about this post