ఏపీ అధికార పక్షం.. వైసీపీ తరచుగా.. తమకు మాత్రమే ప్రజాబలం ఉందని.. తాము మాత్రమే ప్రజలకు నిజమైన సేవకుల మని పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. టీడీపీ పని కూడా అయిపోయిందని వ్యాఖ్యా నిస్తున్నారు. మంత్రుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కూడా.. వారు.. ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అయితే.. దీనిని విన్నవారు.. నిజమేనేమో.. అని అనుకుంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో టీడీపీ పరిస్థితిని గమనిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

టీడీపీ ఇమేజ్ అంగుళం కూడా తగ్గలేదని.. పరిశీలకలు చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీ నేతలు కొం చెం కష్టపడితే.. పార్టీ పుంజుకోవడంతోపాటు.. ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతుందని అంటు న్నారు. తాజాగా చంద్రబాబు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖలో మొదలు పెట్టి.. ఇటు తూర్పు వరకు సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ పర్యటనల్లో బాదుడే -బాదుడు కార్యక్రమాలను నిర్వహించారు. అయితే.. వాస్తవా నికి చంద్రబాబు సభలకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ నుంచి ప్రయత్నాలు సాగాయి.

కానీ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా..చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమాలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పోటెత్తారు. అంతేకాదు.. ఆయన నిర్వహించిన రోడ్ షోలకు కూడా ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ పరిణామాలను గమనించిన వారు.. ఖచ్చితంగా టీడీపీకి మళ్లీ ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాదు.. కొంచెం కష్టపడితే.. వచ్చే ఎన్నికల్లోవిజయం తథ్యమనే చెబుతున్నారు. చంద్రబాబు పర్యటన ద్వారా.. ఆయా జిల్లాల్లో టీడీపీ పుంజుకుందని అంటున్నారు.

ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని అంటున్నారు. దీనిని బట్టి నాయకులుత మ గ్రాఫ్‌ను తామే నిర్ణయించుకోవాలని కూడా సూచిస్తున్నారు. “చంద్రబాబు సైడ్ నుంచి అంతా ఓకే. ఇక, నాయకులే తేల్చుకోవాలి. ప్రజలతో నిత్యం కనెక్ట్ కావడం.. వారి సమస్యలపై స్పందించం.. అవసరమైతే.. ప్రజల్లోనే ఉండడం వంటివి చేయాలి. అప్పుడు ఖచ్చితంగా టీడీపీ విజయం దక్కించుకోవడం ఖాయం“ అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post