నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్న చంద్రబాబు…అసెంబ్లీ సీట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే..ఈ సారి మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారం కైవసం చేసుకోవాలని చెప్పి బాబు…ప్రతి అసెంబ్లీ స్థానంలో పార్టీ బలపడేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు…ఎక్కడకక్కడ వైసీపీకి ధీటుగా టీడీపీ ఎదిగేలా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

అయితే బాబు ఎక్కువగా అసెంబ్లీ సీట్లపై ఫోకస్ పెట్టి, పార్లమెంట్ సీట్ల గురించి పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. అంటే మొదట రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అసెంబ్లీ సీట్లే మెయిన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటే ఎంపీ సీట్లు కూడా ముఖ్యమే. అసెంబ్లీ సీట్లలో బలపడితే…ఎంపీ సీట్లలో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి..కాకపోతే కొన్ని చోట్ల బలమైన ఎంపీ అభ్యర్ధులు లేకపోతే క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది.ఉదాహరణకు గత ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ లోని నాలుగు అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలిచింది…మూడు సీట్లు వైసీపీ గెలిచింది. కానీ బాపట్ల ఎంపీ అభ్యర్ధి వీక్ గా ఉండటంతో…పార్లమెంట్ సీటు వైసీపీ ఖాతాలో పడింది. కాబట్టి ఈ సారి పార్లమెంట్ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని పెట్టాల్సిన అవసరం ఉంది. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు పార్లమెంట్ సీట్లలో టీడీపీ సిటింగ్ ఎంపీలు ఉన్నారు. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అమలాపురం, మచిలీపట్నం, తిరుపతి, నంద్యాల, అనంతపురం, హిందూపురం, కర్నూలు పార్లమెంట్ సీట్లలో టీడీపీకి అభ్యర్ధులు ఉన్నారు.

కానీ అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం, బాపట్ల, నరసారావుపేట, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, రాజంపేట, కడప సీట్లలో అభ్యర్ధులు కనిపించడం లేదు. నరసారావుపేటలో రాయపాటి సాంబశివరావు ఉన్నారు గాని, నెక్స్ట్ ఆయన పోటీ చేస్తారో లేదో క్లారిటీ లేదు. అటు బాపట్లలో మాల్యాద్రి ఉన్నారు…కానీ ఆయనకు నెక్స్ట్ సీటు వచ్చే అవకాశాలు కనబడటం లేదు. మొత్తానికైతే చంద్రబాబు…ఎంపీ సీట్లపై కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
Discussion about this post