టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైంది.. త్యాగాలు. వచ్చే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని అన్నారో.. లేక.. ఇప్పుడున్న పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారో.. తెలియ దు కానీ.. చంద్రబాబు ఆసక్తిగా మాట్లాడారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నేను త్యాగాలకు సిద్ధంగా ఉన్నాను.. అని చెప్పారు. అంటే.. దీని అర్ధం వచ్చే ఎన్నికల్లో పార్టీ అనేక రూపాల్లో త్యాగాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పకనే చెప్పారు. అయితే.. ఈ త్యాగాలు ఏ రూపంలో ఉంటాయి? ఎలా ఉంటాయి? అనేది చర్చనీయాంశంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపాలనేది.. టీడీపీ ప్రధాన లక్ష్యం. అయితే.. ఇది సాధించడం ఇప్పుడు న్న పరిస్థితిలో కష్టమనే ఉద్దేశం ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సిద్ధమ వుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఆయన త్యాగాలకు సిద్ధం కావాలని.. పిలుపునిచ్చారు. ఇక, త్యాగాల విషయానికి వస్తే.. సుమారు 40నియోజకవర్గాల్లో నాయకులు త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని అంటున్నారు సీనియర్లు. ఎందుకంటే.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. దాదాపు 40 నియోజకవర్గాలను వదులు కోవాల్సిన అవసరం ఉంది.

ఇది వాస్తవానికి అంత తేలిక కాదు. ఎందుకంటే.. ప్రతి ఒక్క రూ తమ తమ నియోజవకర్గాలపైనా.. చంద్ర బాబు ఇచ్చే టికెట్ లపైనా.. ఆశలు పెట్టుకున్నారు. అలాగని..ఎవరూ కూడా పార్టీని ఒంటరిగా పోటీ చేయా లని కోరుకోకపోవడం.. ఇప్పుడు టీడీపీలో ఆసక్తిగా మారింది. అంటే.. పార్టీ పొత్తులు పెట్టుకుని తీరాలి. అదేసమయంలో త్యాగాలకు సిద్ధపడతారా? అనేది ప్రశ్న. ఇదే విషయాన్ని ముందుగానే పసిగట్టిన చంద్ర బాబు.. త్యాగాలకు తాను సిద్ధమని ప్రకటించడం ద్వారా.. ఇతర నేతలను కూడా సంసిద్ధులను చేస్తున్నా రని అంటున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన త్యాగాల ప్రకటనపై తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ఎవరు.. కూడా త్యాగాలు చేసేందుకు సిద్ధపడకపోతే.. చంద్రబాబు ఎలా ముందుకు సాగుతారు? అనేది కూడా ఆసక్తిగా మారింది. దీనిపై చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post