ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కొత్త ఒరవడి కనిపిస్తోందా? పార్టీ నేతల్లో జోష్ పెరుగుతోందా? అంటే.. ఔన నే అంటున్నారు పరిశీలకులు. విశ్లేషకులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబు.. తన ప్రసంగాల్లో పదును పెంచారు. ఎక్కడ మాట్లాడినా.. ఆయన వైసీపీ పైనా.. సీఎం జగన్‌పైనా విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఎక్కడ ప్రసంగించినా.. ఆ ప్రసంగాలు కొత్తగా ఉండడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

ఒకప్పుడు చంద్రబాబు మైకు పట్టుకుంటే.. ఇక, గంటలు గడిచిపోయినా.. వదిలి పెట్టరని.. బోర్ కొట్టిస్తార ని.. అటు అధికారుల్లోనూ (అధికారంలో ఉండగా), ఇటు పార్టీ నేతల్లోనూ స్థిరపడిపోయింది. దీంతో చంద్రబాబు ప్రసంగాలకు రావాలంటేనే ఇదో పెద్ద సాహసం అనుకునేవారు. ఈ విషయాన్ని కొందరు బహిరంగంగా చెబితే.. మరికొందరు ఆఫ్‌ది రికార్డుగా చెప్పేవారు. అయితే.. ఇప్పుడు.. ఆయన ప్రసంగాల్లో మార్పు కనిపిస్తోందని.. ఇలా విమర్శించిన వారే చెబుతున్నారు.

“ప్రసంగాల్లో పదును తేలింది. ఎంత సేపు ఆయన మాట్లాడినా.. బోర్ కొట్టడం లేదు. సబ్జెక్టు కూడా బాగుం టోంది. గతంలో కొంత మేరకు బోర్ ఫీలయ్యేవాళ్లం. చెప్పిందే చెప్పేవారు. కానీ, ఇప్పుడు ఎక్కడా చెప్పింది చెప్పడం లేదు. అక్కడి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబు ప్రసంగాలు వినేందుకు మేమే కాదు.. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు“ అని టీడీపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు.. ప్రముఖ లాయర్ కూడా అయిన.. ఆయన వ్యాఖ్యానించారు.

ఇక, ఇదే తరహా పరిస్థితి.. ఇతర నేతల్లోనూ కనిపిస్తోంది. చంద్రబాబు పుంజుకున్నారని.. చాలా మంది అంటున్నారు. అదే సమయంలో ప్రసంగాలు కూడా బాగుంటున్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇదే ఊపు కొనసాగించాలని వారు కోరుతున్నారు. తాజాగా.. జగన్‌ను శ్రీలంక మాజీ ప్రధాని రాజపక్స తో పోల్చుతూ.. చంద్రబాబు చేసిన ప్రసంగం.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంగమనార్హం.

Discussion about this post