టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ రాజ్ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు గవర్నర్ తో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తనతో పాటు వచ్చిన టీడీపీ నేతలను చంద్రబాబు గవర్నర్ కు పరిచయం చేశారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపైనా ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. వివిధ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.


ఈ సందర్భంగా గవర్నర్ ను కలిసిన వారిలో చంద్రబాబు వెంట యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ వంటి సీనియర్ నేతలు ఉన్నారు.
Leave feedback about this