తెలుగుదేశం పార్టీకి కొన్ని స్థానాలు ఇప్పటికీ కలిసిరావట్లేదు. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు పుట్టిన గడ్డ చంద్రగిరి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారింది. దాదాపు ఇక్కడ టిడిపి గెలిచి 30 ఏళ్ళు అయింది..ఈ సారైనా గెలుస్తుందనే నమ్మకం కూడా కనిపించడం లేదు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె గ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. చంద్రబాబు గెలుపు మొదలైంది..ఇక్కడ నుంచే.

1978లో బాబు తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చంద్రగిరిలో గెలిచారు..కానీ 1983లో టిడిపి వచ్చింది..కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బాబుకు చెక్ పెట్టింది. ఆ తర్వాత బాబు టిడిపి వైపుకు రావడం..1985లో పోటీ చేయలేదు..1989 నుంచి కుప్పంలో పోటీ చేస్తూ వస్తున్నారు. అక్కడే గెలుస్తూ వస్తున్నారు. బాబు ఇటు కుప్పం వైపు రావడంతో చంద్రగిరిలో టిడిపి గెలుపుకు దూరమైంది. 1983 తర్వాత 85లో గెలిచింది. మళ్ళీ 1994లో గెలిచింది.

ఇంకా అంతే మళ్ళీ అక్కడ పార్టీ గెలవలేదు. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. అంటే వరుసగా ఐదు ఎన్నికల్లో టిడిపి గెలవలేదు. ఈ సారి గెలుస్తుందనే నమ్మకం కనిపించడం లేదు. ఎందుకంటే చంద్రగిరి వైసీపీ కంచుకోట అయింది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చెవిఎడ్డి భాస్కర్ రెడ్డి హవా నడుస్తోంది. ఆయనకు చెక్ పెట్టాలని టిడిపి గట్టిగా ట్రై చేస్తుంది.

తాజాగా చంద్రగిరిలో లోకేశ్ పాదయాత్ర జరగగా, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే చంద్రగిరిలో టిడిపి తరుపున పులివర్తి నాని పోటీ చేస్తారని లోకేశ్ ప్రకటించారు. కానీ నానికి..చెవిరెడ్డిని నిలువరించడం కష్టమనే చెప్పాలి. చంద్రగిరిలో పార్టీ బలంతో పాటు చెవిరెడ్డికి సొంత బలం ఉంది. దీంతో చంద్రగిరిలో టిడిపికి ఛాన్స్ దక్కడం లేదు. మరి ఈ సారైనా టిడిపికి లక్ ఉంటుందేమో చూడాలి.
