రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ కీలకమైన రెడ్డి వర్గం రాజకీయాలని ప్రభావితం చేస్తుంది. ఇక రెడ్డి వర్గం మొదట్లో కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీకి మద్ధతుగా నిలుస్తూ వస్తుంది. దీని వల్ల సీమలో వైసీపీ హవా నడుస్తుంది. గత ఎన్నికల్లో సీమలో ఏ విధంగా వైసీపీ సత్తా చాటిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సీమలో మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే..అందులో 49 సీట్లు వైసీపీ గెలుచుకుంది..టిడిపికి 3 సీట్లు వచ్చాయి. అంటే వైసీపీ హవా ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. అలా వైసీపీ హవా సాగిన సీమలో ఈ సారి సత్తా చాటాలని టిడిపి చూస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంది. అటు వైసీపీ వల్ల రెడ్డి వర్గం కూడా నష్టపోయే పరిస్తితి.

ఇటు టిడిపి బలపడుతుంది..అలాగే లోకేశ్ యువగళం పాదయాత్రతో సీమని చుట్టేశారు. ప్రజలకు చేరువయ్యారు. దీంతో సీమలో టిడిపికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో లోకేశ్..సీమకు పలు కీలక హామీలు ఇవ్వాలని చూస్తున్నారు. అధికారంలోకి వస్తే సీమ అభివృద్ధికి ప్రత్యేక కమిటీని నియమించాలని చూస్తున్నారు. అలాగే సీమలో తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేసి..అక్కడ ప్రజలకు అండగా ఉండాలని చూస్తున్నారు. పలు కంపెనీలు ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచి..వలసలని ఆపాలని చూస్తున్నారు. ఇలా లోకేశ్..సీమ కోసం ప్రత్యేకంగా పనిచేయనున్నారు.
అయితే ఇదే విధంగా ముందుకెళితే సీమలో టిడిపి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికల సమయంలో రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీఠ వేయాలని చూస్తున్నారు. మెజారిటీ సీట్లు వారికి ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తానికైతే సీమలో సత్తా చాటడమే లక్ష్యంగా లోకేశ్ పనిచేయనున్నారు.