వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని జగన్ సవాల్ విసురుతున్న విషయం తెలిసిందే. అంటే రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి లబ్ది జరుగుతుందనేది జగన్ ప్లాన్. అదే సమయంలో తాము ఎలా పోటీ చేస్తే జగన్‌కు ఎందుకు..ఇక జగన్‌కు దమ్ముంటే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇవ్వాలని టిడిపి శ్రేణులు సవాల్ చేస్తున్నాయి. అయితే ఆ ధైర్యం జగన్ చేయరనే చెప్పాలి.
ఎందుకంటే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. వారికి మళ్ళీ సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయం. అందుకే జగన్ కొందరు ఎమ్మెల్యేలని పక్కన పెట్టడం ఖాయం. ఇదే సమయంలో కొందరు కీలక నేతలకు సీట్లు ఇవ్వడం కష్టమనే ప్రచారం వస్తుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌లకు సీట్లు ఉండవని ప్రచారం వస్తుంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో తెలియదు గాని..వీరి ఇద్దరికి సీట్లు ఇస్తే..టిడిపి-జనసేన పొత్తులో బలి అవ్వడం ఖాయమని చెప్పవచ్చు.

వీరిలో అవంతి గురించి మాట్లాడుకుంటే..ఈయన గత మూడు ఎన్నికల్లో వేరే పార్టీల వల్లే గెలుస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచారు..అప్పుడు ఓట్ల చీలిక వల్ల భీమిలిలో గెలిచారు. 2014లో టిడిపి నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. అప్పుడు జనసేన సపోర్ట్ దక్కింది. 2019లో వైసీపీ నుంచి భీమిలిలో గెలిచారు. అప్పుడు జనసేన ఓట్లు చీల్చడం వల్ల గెలిచారు.
ఈ సారి మాత్రం టిడిపి-జనసేన పొత్తులో పోటీ చేయనున్నాయి. దీంతో ఈ సారి అవంతికి చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఈయన పార్టీ మారతారనే ప్రచారం కూడా వస్తుంది. దీంతో భీమిలి సీటు మంత్రి బొత్స తనయుడుకు ఇస్తారనే ప్రచారం ఉంది. చూడాలి మరి భీమిలిలో ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయో.
