అధికార వైసీపీ నుంచి ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే..నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైసీపీకి దూరమయ్యారు. వైసీపీలో జరుగుతున్న కొన్ని తప్పులని ఎత్తిచూపడం..ఆయనకు అధిష్టానం సమయం ఇవ్వకపోవడంతో..అప్పటినుంచి రఘురామ వైసీపీకి యాంటీగా మారిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పనిలేదు.

ఇలా వైసీపీ రెబల్ గా మారిన రఘురామ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు వైసీపీ రెబల్స్ గా మారిన ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసి గెలుస్తామని చెప్పారు. ఇటీవలే వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇలా ముగ్గురు నేతలు వైసీపీకి దూరమయ్యారు.

ఇక వీరు వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టిడిపి-జనసేన పొత్తులో పోటీ చేస్తానని రఘురామ చెప్పారు. అటు టిడిపిలోకి వెళ్లాలని ఉండని కోటంరెడ్డి చెప్పారు. ఆనం సైతం టిడిపి నేతలతో టచ్ లో ఉన్నారు. అయితే వీరిలో కోటంరెడ్డి మళ్ళీ నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయడం ఖాయమే.
కానీ ఆనం ఈ సారి వెంకటగిరిలో పోటీ చేస్తారా? లేదా ఆత్మకూరు? నెల్లూరు సిటీ? లో పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. అటు రఘురామ మళ్ళీ నరసాపురం ఎంపీగా బరిలో దిగుతారా? లేక వేరే సీటులోకి వెళ్తారా? అనేది చూడాల్సి ఉంది.