రాజకీయాల్లో అవకాశాలు అనేవి ఈజీగా రావు..ఎంతో కష్టపడితే వస్తాయి…అలాగే వచ్చిన అవకాశాలని కూడా కష్టపడి నిలబెట్టుకోవాలి…అలా కాకుండా కష్టపడకుండా అవకాశాలు నిలబడతాయని అనుకోవడం పొరపాటే అని చెప్పొచ్చు. సరిగ్గా కష్టపడకపోతే ఉన్న అవకాశాలు పోతాయని టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీని చూసి నేర్చుకోవచ్చు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో కేఈ ఫ్యామిలీకి..చంద్రబాబు అనేక అవకాశాలు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు కూడా ఇచ్చారు.

అలాగే జిల్లాలో రెండు సీట్లు ఈ ఫ్యామిలీకే కేటాయించారు..డోన్, పత్తికొండ సీట్లు ఈ ఫ్యామిలీ కిందే ఉన్నాయి…ఇక గత ఎన్నికల్లో రెండుచోట్ల కేఈ ఫ్యామిలీ ఓడిపోయింది…పత్తికొండలో కేఈ శ్యామ్, డోన్‌లో కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే తర్వాత టీడీపీ అధికారం కోల్పోవడంతో వారు నియోజకవర్గాలు మొహం చూడటం మానేశారు. దీంతో నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది.


మధ్యలో డోన్ బాధ్యతలు చూడటం లేదని చెప్పి ప్రతాప్‌ని తప్పించి…కేఈ ప్రభాకర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన కూడా సరిగ్గా పట్టించుకోలేదు..దీంతో ఏకంగా డోన్ బాధ్యతలని వేరే నాయకుడుకు అప్పగించారు. సుబ్బారెడ్డికి డోన్ బాధ్యతలు అప్పగించారు..ఇప్పుడు అక్కడ సుబ్బారెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. ఇక సీటు పోయాక కేఈ ఫ్యామిలీ అలెర్ట్ అయింది…పత్తికొండ పోతుందేమో అని చెప్పి…ఇప్పుడు అక్కడ పనిచేయడం మొదలుపెట్టారు.

అదే సమయంలో మళ్ళీ డోన్ సీటు దక్కించుకోవాలని కేఈ ఫ్యామిలీ గట్టిగా ట్రై చేస్తుంది..ఈ సారి నుంచి సరిగ్గా పనిచేస్తామనే హింట్ చంద్రబాబుకు ఇస్తున్నారు…కానీ చంద్రబాబు వెనక్కి తగ్గేలా లేరు..మరొకసారి డోన్ సీటు మాత్రం కేఈ ఫ్యామిలీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ డోన్ కాకపోతే మరొక సీటు ఏమన్నా దొరుకుతుందేమో అని కేఈ ఫ్యామిలీ ట్రై చేస్తుంది..కానీ ఏ సీటు కూడా ఆ ఫ్యామిలీకి దక్కదని తెలుస్తోంది. ఇక ఉన్న పత్తికొండ సీటుతోనే కేఈ ఫ్యామిలీ అడ్జస్ట్ అవ్వాల్సిందే. మొత్తానికి చేతులారా సీటు పోగొట్టుకున్నారు.

Discussion about this post