ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్..ఏపీ కేబినెట్‌లో బాగా చదువుకున్న మంత్రి ..పైగా డిసెంట్ గా ఉండే నాయకుడు. అలాగే ప్రత్యర్ధులపై దూకుడుగా విమర్శలు చేయడం, బూతులు తిట్టడం చేయరు. కానీ వైసీపీ వేసిన స్కెచ్ లో ఆయన ఇప్పుడు పావుగా మారిపోయారు. తాజాగా సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెంకు చంద్రబాబు వచ్చారు. ఇక బాబు పర్యటనకు సురేశ్ సడన్ గా నిరసన తెలిపారు.
దళిత ద్రోహి అని, గో బ్యాక్ బాబు అని, దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు సందర్భం ఏమి లేదు..గత ఎన్నికల్లో బాబు దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారని అన్నారట. దానికి ఇప్పుడు నిరసన చేశారు. అయితే అప్పుడు బాబు అన్నది వేరు..దాన్ని వైసీపీ మార్చేసి ఫేక్ ప్రచారం చేసింది. కాకపోతే బాబు పర్యటనలకు పెద్ద ఎత్తున జనం వస్తున్న నేపథ్యంలో సురేశ్ చేత వైసీపీ ఇలా డ్రామా వేయించిందని విమర్శలు వస్తున్నాయి. ఎంతో డిసెంట్ గా ఉండే మంత్రి చొక్కా విప్పి మరీ హల్చల్ చేశారు. దీని వల్ల మంత్రికే నెగిటివ్ అయింది.

అసలు యర్రగొండపాలెంలో సురేష్‌కు మంచి పట్టుంది. ఆయనకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన చేసిన పనికి చేతులారా ఓటమిని దగ్గర చేసుకున్నట్లు అయింది. పైగా సురేష్ పనులతో బాబు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా యర్రగొండపాలెం టిడిపి అభ్యర్ధిగా ఎరిక్షన్ బాబుని ప్రకటించేశారు.
దీంతో ఆయన పోటీ ఖాయమైంది. ఇప్పటికే ఆ సీటు కోసం పలువురు టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సీటు ప్రకటించడంతో టిడిపి శ్రేణుల్లో జోష్ పెరిగింది. అసలు అనవసరంగా సురేష్ తన గెలుపుని దూరం చేసుకునేవరకు వెళ్లారు.