చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు..ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేర్లు…టీడీపీలో ఉన్న టాప్ ఫైర్ బ్రాండ్ నాయకులు..ఎప్పుడు తమ పార్టీకి అండగా ఉంటూ…ప్రత్యర్ధులపై విరుచుకుపడే నేతలు. పూర్తిగా మాస్ ఫాలోయింగ్ ఉన్న కమ్మ లీడర్లు. ఇలా మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు నేతలకు గత ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది…జగన్ గాలిలో ఇద్దరు నేతలు ఓటమి పాలయ్యారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్, గురజాలలో యరపతినేని ఓటమి పాలయ్యారు.


అయితే దెందులూరులో చింతమనేనికి మంచి ఫాలోయింగ్ ఉంది…2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచారు కూడా…అలాగే టీడీపీ అధికారంలో ఉండగా దెందులూరులో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ ఆయన దూకుడుని ఆసరాగా తీసుకుని వైసీపీ బాగా నెగిటివ్ గా ప్రచారం చేసింది. అదే చింతమనేనికి బాగా మైనస్ అయింది…అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక చింతమనేనిపై ఎన్ని కేసులు వచ్చి పడ్డాయో…ఎన్ని సార్లు జైలుకు వెళ్ళి వచ్చారో చెప్పాల్సిన పని లేదు.

ఇలా టార్గెట్ చేసిన సరే చింతమనేని తగ్గలేదు…మళ్ళీ దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. దీంతో తక్కువ సమయంలోనే దెందులూరులో పికప్ అయ్యారు. పైగా అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరుగుతూ వస్తుంది. ఇదే చింతమనేనికి ప్లస్ అయింది.

అటు గురజాలలో కూడా యరపతినేని దూకుడుగా పనిచేస్తున్నారు…1994, 2009, 2014 ఎన్నికల్లో యరపతినేని ఎమ్మెల్యేగా గెలిచారు..2019లో జగన్ గాలిలో ఓడిపోయారు. ఓడిపోయాక యరపతినేని ఏ మాత్రం తగ్గకుండా పనిచేస్తూ వస్తున్నారు.ఆ మధ్య జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేలా టీడీపీని నిలబెట్టారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేలా యరపతినేని దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా గురజాలలో వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి పనితీరు పెద్దగా ఏం బాగోలేదు..ఇక అక్కడ వైసీపీ నేతల అక్రమాలు కూడా ఎక్కువయ్యాయని ప్రచారం జరుగుతుంది..ఇదంతా వైసీపీకి మైనస్ అవుతుంటే..యరపతినేనికి ప్లస్ అవుతుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో చింతమనేని, యరపతినేని…వైసీపీకి షాక్ ఇచ్చి విజయాలు అందుకునేలా ఉన్నారు.

Discussion about this post