ఆయన నోరు విప్పితే.. ఫైర్. ఆయన అడుగు తీసి.. అడుగు వేస్తే.. ఫైర్. ఆయన ఏం చేసినా.. ఫైర్.. ఆయ నే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సీనియర్ నాయకుడు , దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. చింతమనేని గురించి మాట్లాడేటప్పుడు.. పెద్దగా పరిచయం అవసరం లేదు. సో.. డైరెక్ట్‌గా విష యంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన.. చింతమనేని.. పని అయిపోందని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో అయితే.. తెగ ప్రచారం చేశారు.

ఇక, ఇక్కడ చింతమనేని పోస్టర్ చిరిగిపోయిందని, ఆయన ఇక, పలుగు, పారా పట్టుకుని.. పొలంలోనే ఉండి పోవచ్చని వ్యంగ్యాస్త్రాలు కూడా వచ్చాయి. అయితే.. ఇది జరిగి కేవలం రెండేళ్లే అయింది. కానీ, ఇప్పుడు ఇదే చింతమనేనిపై.. ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. “నువ్వు ఓడిపోయినా.. నీ సేవలు మాకు ఇప్పటికి అందుతున్నాయన్నా!!“ అంటూ.. ఇక్కడి ప్రజలు పేపర్కొంటున్నారు. ఆయన ప్రమేయం లేకున్నా.. ఆయనకు సంబంధించిన పాజిటివిటని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

రైతులకు అండగా ఉండడం.. ఎక్కడ ఏసమస్య వచ్చినా..నేనున్నా.. అంటూ.. ఆయన ముందుకు రావడం.. ఇలా.. అనేక రూపాల్లో చింతమనేని గ్రాఫ్ పెరుగుతోంది. పైగా.. పార్టీలో ఒకప్పుడు ఆయనను పట్టించుకోని ఓ వర్గం నాయకులు కూడా.. ఇప్పుడు ఆయనను పిలుస్తున్నారు. ఆయన లేకుండా కార్యక్రమాలు కూడా చేయడం లేదు. అటు చంద్రబాబు దగ్గర కూడా చింతమనేని గ్రాఫ్ పెరిగింది. ఎందుకంటే.. ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది.

అంతేకాదు.. గతంలో నోరు విప్పితే.. సంచలనాలకు వేదికగా ఉన్న చింతమనేని వాయిస్.. ఇప్పుడు గత కొన్నాళ్లుగా.. సమస్యల వైపు సాగుతోంది. ఎక్కడ సమస్య ఉన్నా.. అక్కడ కనిపిస్తున్నారు. రైతులకు, సామాన్యులకు ఆయన చేరువ అవుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి విషయంపై ఆయన మాట్లాడుతు న్నతీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో చింతమనేని గ్రాఫ్ పెరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఆయనదే ఘన విజయమని చెబుతున్నారు.

Discussion about this post