గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో కూడా మంచి మెజారిటీతో టీడీపీ గెలిచిన సీట్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల కూడా ఒకటి. సీనియర్ నేత కరణం బలరామ్..టీడీపీ తరుపున నిలబడి దాదాపు 18 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడం, కరణం ఫ్యామిలీకి పలు వ్యాపారాలు ఉండటం..రాజకీయంగా ఇబ్బదులు ఎదురవుతాయనే కోణంలో వైసీపీలోకి వెళ్లారు. దీంతో చీరాలలో టీడీపీకి యడం బాలాజీని ఇంచార్జ్ గా పెట్టారు. ఈయన ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకుడు.


కొన్నాళ్లు పాటు టీడీపీలో పనిచేసిన యడం..తర్వాత పార్టీలో కనిపించలేదు. దీంతో చీరాలలో ఎంఎం కొండయ్యని టీడీపీ ఇంచార్జ్ పెట్టారు. ఆయన కాస్త యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. కాకపోతే టీడీపీకి అనుకున్న మేర బలం మాత్రం పెరగలేదు. వాస్తవానికి చీరాల వైసీపీలో అంతర్గత విభేదాలు ఎక్కువ ఉన్నాయి. ఎమ్మెల్యే కరణం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాలకు పడటం లేదు.

వైసీపీలో ఉన్న పరిస్తితులని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ విఫలమవుతుంది. అయితే ఈ సీటుపై పెద్ద కన్ఫ్యూజన్ ఉంది..సీటు కొండయ్యకు ఇస్తారో లేదో క్లారిటీ లేదు. అదే సమయంలో ఇక్కడ కొత్త చర్చ వస్తుంది. టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందనే నేపథ్యంలో ఈ సీటు జనసేనకు ఇస్తారని ప్రచారం అవుతుంది. కాపు నేతగా ఉన్న యడం బాలాజీనే జనసేన తరుపున పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది.

ఇటీవల కాపు నేతల సమావేశాల్లో యడం కూడా కీలకంగా ఉంటున్నారు. మరి చీరాల సీటు విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
