గతంలో చిరంజీవి వల్ల గాని..ఇప్పుడు పవన్ కల్యాణ్ గాని రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాలేదన్న విషయం తెలిసిందే. భవిష్యత్‌లో పవన్ ఏమన్నా సక్సెస్ అవుతారేమో చూడాలి గానీ…ఇప్పటివరకైతే రాజకీయంగా సక్సెస్ చూడలేదు. అయితే ఇలా అన్నదమ్ములు రాజకీయంగా సక్సెస్ కాలేకపోయినా…వీరి వల్ల మాత్రం కొందరు నేతలు సక్సెస్ అవ్వగా, కొందరు నేతలు దెబ్బతిన్నారు. ఇక ఇందులో కొత్తగా చెప్పేది ఏముంది 2009లో చిరంజీవి ప్రజారాజ్యం వల్ల కొందరు కాంగ్రెస్ నేతలకు మేలు జరగగా, టీడీపీ నేతలకు డ్యామేజ్ జరిగింది. అలాగే 2019 ఎన్నికల్లో పవన్ జనసేన వల్ల వైసీపీ నేతలకు మేలు జరగగా, టీడీపీ నేతలకు మళ్ళీ డ్యామేజ్ జరిగింది.

అయితే అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీల్లో ఉండి లబ్ది పొందిన వారిలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఒకరు. ఈయన కేవలం చిరు, పవన్‌ల వల్లే గెలిచారని చెప్పొచ్చు. అది ఎలా అంటే 2009 ఎన్నికల్లో పెడన నుంచి జోగి కాంగ్రెస్ తరుపున బరిలో దిగి టీడీపీ నేత కాగిత వెంకట్రావుపై కేవలం 1200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ అప్పుడు ప్రజారాజ్యం చీల్చిన ఓట్లు 30 వేలు. అంటే చిరు ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో అదే జోగి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్‌పై 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక అప్పుడు జనసేనకు పడిన ఓట్లు 25 వేలు..అంటే పెడనలో చిరు, పవన్‌ల వల్ల జోగికి ఎంత బెనిఫిట్ అయిందో చెప్పాల్సిన పని లేదు.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జోగికి ఇలాంటి లక్కీ ఛాన్స్ ఉండేలా కనిపించడం లేదు. ఈ సారి సీన్ మారుతుంది…పెడన ప్రజల అభిప్రాయం మారుతుంది. నెక్స్ట్ జోగికి వ్యతిరేకంగా ఫలితం వచ్చేలా ఉంది…ఈ సారి పవన్, టీడీపీతో కలిసిన కలవకపోయినా జోగికి మాత్రం ఇబ్బంది అయ్యేలా ఉంది. ఒకవేళ పవన్ కలిస్తే మాత్రం డౌట్ లేకుండా జోగి ఓటమి అంచుకు చేరినట్లే.

Discussion about this post