నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలని టీడీపీ చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు-పవన్ కలిసి..ఎన్నికలే లక్ష్యంగా కలిసి ముందుకెళ్లనున్నారు. అయితే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు కేటాయించాలసిన అవసరం ఉంది. ఇక ఎన్ని సీట్లు ఇస్తారనేది క్లారిటీ లేదు. జనసేన ఎన్ని సీట్లు అడుగుతుందనేది క్లారిటీ లేదు. కాకపోతే ఈ సీట్ల పంపకాలపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

అయితే చంద్రబాబు ముందే పొత్తుని ఊహించి కొన్ని సీట్లని జనసేన కోసం రిజర్వ్ చేసినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సీట్లలో టెంపరరీగా ఇంచార్జ్‌లని పెట్టడం లేదా అసలు ఇంచార్జ్‌లని పెట్టకపోవడం చేశారు. ఇక అలాంటి సీట్లని జనసేనకు కేటాయించడం ఖాయమని తెలుస్తోంది. ఇదే క్రమంలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రెండు మూడు సీట్లు జనసేనకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే చిత్తూరు అసెంబ్లీ సీటులో టీడీపీ ఇంచార్జ్‌ని నియమించలేదని సమాచారం.

గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి మనోహర్ పోటీ చేసి ఓడిపోయారు..తర్వాత ఆయన టీడీపీని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటినుంచి ఇంచార్జ్‌ని పెట్టలేదు. పలువురు నేతలు ఇంచార్జ్ పదవికి పోటీ పడుతున్న సరే..ఎవరిని అక్కడ పెట్టలేదు.ఖాళీగా ఉంచేశారు. అంటే జనసేనకు ఆ సీటు ఇవ్వడం కోసమే టీడీపీలో ఇంచార్జ్‌ని పెట్టలేదని తెలుస్తోంది. ఇక తిరుపతి సీటుని సైతం జనసేనకు ఇస్తారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల తేడాతో ఇక్కడ టీడీపీ ఓడింది. జనసేన ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది. మరి ఈ సీటుని జనసేనకు కేటాయిస్తారో లేదో చూడాలి.

Leave feedback about this