అధికార వైసీపీలో మంత్రి పదవి విషయంలో పోటీ బాగా పెరిగిపోయింది…మంత్రి పదవి దక్కించుకోవాలని చెప్పి…చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు..త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు ఛాన్స్ వస్తే బాగుండు అని ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లాలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు పదవి కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇక్కడ మంత్రి పదవి ఆశించేవారి లిస్ట్ చాలా పెద్దగానే ఉంది.

ప్రస్తుతానికి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు క్యాబినెట్‌లో ఉన్నారు..మరి నెక్స్ట్ వీరిని జగన్ సైడ్ చేసి, కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా? లేదా అనేది చూడాలి. అయితే నారాయణస్వామిని ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…మరి సీనియర్ నేత పెద్దిరెడ్డిని సైడ్ చేస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ 100 శాతం మంత్రివర్గంలో మార్పులు చేస్తే పెద్దిరెడ్డి కూడా సైడ్ అవ్వాల్సిందే.


ఇక జిల్లాలో పలువురు రెడ్డి ఎమ్మెల్యేలు పదవి ఆశించే లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజా…మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు..మొదట విడతలోనే పదవి దక్కుతుందని అనుకున్నారు…కానీ అప్పుడు ఛాన్స్ రాలేదు..మరి ఈ సారైనా ఛాన్స్ రాకపోదా? అని ఎదురుచూస్తున్నారు. అటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైతం పదవి ఆశిస్తున్నారు…ఇదే చివరి ఛాన్స్ అన్నట్లు పదవి కోసం ట్రై చేస్తున్నారు.



అలాగే పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పొజిషన్ కూడా అదే…మళ్ళీ పదవి దక్కుతుందో లేదో చెప్పలేం…అందుకే ఇప్పుడే మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం మంత్రి రేసులో ఉన్నారని తెలుస్తోంది. తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సైతం ఏదైనా ఛాన్స్ దొరకకపోతుందా? అని చూస్తున్నారు. చూడాలి మరి ఈ సారి చిత్తూరులో ఏ రెడ్డి ఎమ్మెల్యేకు మంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందో.



Discussion about this post