చంద్రబాబు అనే కుప్పం…కుప్పం అంటే చంద్రబాబు….ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే అలాంటి కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే కుప్పంలో బాబుని ఓడించడం అంత సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ కుప్పంలో చంద్రబాబుకు షాక్ ఇస్తే…ఆ ప్రభావం చిత్తూరు జిల్లాపై బాగా పడుతుంది. జిల్లాలోని టీడీపీ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది.

ముఖ్యంగా కుప్పంలో దెబ్బతింటే చిత్తూరు పార్లమెంట్‌లో కూడా టీడీపీ దెబ్బతినడం ఖాయం. ఎందుకంటే వేరే రాజకీయాలతో సంబంధం లేకుండా చిత్తూరు పార్లమెంట్ సీటు కేవలం కుప్పం సీటుపైనే ఆధారపడి ఉంది. అక్కడ బాబుకు వచ్చే భారీ మెజారిటీనే చిత్తూరులో టీడీపీ గెలుపు కారణమవుతుంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోనే కుప్పం అసెంబ్లీ ఉంది…ఇంకా పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఫలితం ఎలా ఉన్నా సరే కుప్పంలో భారీ మెజారిటీ వస్తే దాని బట్టే చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీ గెలుస్తుందని చెప్పొచ్చు.

ఇప్పటివరకు చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీ ఏడు సార్లు గెలిచింది. ఇక 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు వచ్చిన భారీ మెజారిటీ బట్టే చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీ గెలిచేసింది. కానీ 2019 ఎన్నికల్లో కుప్పంలో బాబుకు భారీ మెజారిటీ రాలేదు. పైగా జగన్ గాలి గట్టిగా ఉంది…దీంతో చిత్తూరు పార్లమెంట్‌లో వైసీపీ గెలిచేసింది. అయితే ఈ సారి కూడా చిత్తూరు పార్లమెంట్‌ని కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తుంది. అలాగే కుప్పంపై కూడా కన్నేసిన విషయం తెలిసిందే.

కుప్పంలో బాబుని దెబ్బకొడితే…చిత్తూరులో టీడీపీ అడ్రెస్ గల్లంతు అవుతుంది. అందుకే కుప్పం టార్గెట్‌గా వైసీపీ ఏ విధంగా ముందుకెళుతుందో చెప్పాల్సిన పని లేదు. అక్కడ బాబుకు చెక్ పెట్టడానికి గట్టిగానే ట్రై చేస్తుంది…స్థానిక ఎన్నికల్లో ఎలాగో చెక్ పెట్టేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెక్ పెట్టాలని చూస్తున్నారు. కానీ అంత సాధ్యం కాదనే చెప్పొచ్చు. ఏదేమైనా కుప్పం బట్టే చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీ గెలుపు ఆధారపడి ఉంది.

Discussion about this post