అధికార వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా…ఎన్ని రకాల వ్యూహాలు వేసినా… సరే విశాఖపట్నంలో టీడీపీని మాత్రం దెబ్బకొట్టలేకపోయిందని చెప్పాలి. మొదట నుంచి విశాఖ టీడీపీకి అనుకూలంగా ఉండే జిల్లానే..కానీ గత ఎన్నికల్లోనే జిల్లాలో పార్టీ దారుణంగా ఓడిపోయింది. కాకపోతే సిటీలో పార్టీ సత్తా చాటింది. దీంతో టీడీపీని మరింత దెబ్బకొట్టాలని చెప్పి వైసీపీ వేయని ఎత్తుగడ లేదు. ఎక్కడకక్కడ నాయకులని తోక్కేస్తూ వైసీపీ ముందుకెళ్లింది. అలాగే మూడు రాజధానుల పేరుతో టీడీపీని ఇంకా అణిచివేయాలని అనుకున్నారు. కానీ వైసీపీకి పెద్ద సాధ్యం కాలేదనే చెప్పాలి. ఏదో విశాఖ సిటీలో కాస్త పార్టీకి దెబ్బ వేశారు గానీ…రూరల్ ప్రాంతంలో టీడీపీ పుంజుకోవడాన్ని ఆపలేకపోయారు.

ఈ రెండున్నర ఏళ్లలో చాలా వరకు పార్టీ పికప్ అయింది. అయితే టీడీపీ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో పికప్ అవ్వాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో టీడీపీ పికప్ అవ్వలేకపోతుంది. ఇదే క్రమంలో చోడవరం, మాడుగుల లాంటి నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకున్నట్లు కనిపించడం లేదు. మామూలుగా ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలే.

కానీ గత ఎన్నికల్లోనే రెండుచోట్ల టీడీపీకి భారీ షాకులు తగిలాయి. రెండుచోట్ల వైసీపీ గెలిచేసింది. అయితే ఇప్పటికీ రెండుచోట్ల వైసీపీ స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. దీని వల్ల టీడీపీ పికప్ అవ్వడానికి అవకాశాలు దొరకడం లేదు. చోడవరంలో కేఎస్‌ఎన్ రాజు అంతగా బలపడినట్లు లేరు. ఈ రెండున్నర ఏళ్లలో బలపడటానికి మంచి అవకాశాలు వచ్చినా సరే పెద్దగా ఉపయోగించుకున్నట్లు లేరు.

అటు మాడుగులలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పార్టీని పికప్ చేయలేకపోయారు. దీంతో ఆయనని పక్కనబెట్టే పివిజి కుమార్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. ఆయన ఇప్పుడుప్పుడే నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. కాబట్టి అక్కడ పార్టీకి అప్పుడే ప్లస్ అవుతుందని చెప్పలేని పరిస్తితి. మొత్తానికైతే చోడవరం-మాడుగుల నియోజకవర్గాల్లో టీడీపీకి అంత ప్లస్ కనిపించడం లేదు.

Discussion about this post