ఇటీవల కాలంలో ఏపీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది….వరుసపెట్టి సినీ ప్రముఖులు సీఎం జగన్‌ని కలవడం..అదేదో సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ జగనే తీరుస్తున్నట్లు చూపించడం…గత కొన్ని రోజులుగా ఇదే వరుస. అసలు పక్కనే తెలంగాణ రాష్ట్రంతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు…అలాగే సినిమా వాళ్ళు కోరితే చాలు…ఏ పనైనా తెలంగాణ ప్రభుత్వం చేసి పెట్టేస్తుంది…కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం అలా లేదు…అసలు సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు సృష్టించి..ఆ సమస్యలని ఏదో పరిష్కరిస్తామని చెప్పి, సినీ హీరోలని తమ వద్దకు రప్పించడం చేస్తున్నారు.

సరే సినిమా హీరోలకు ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉంటారో చెప్పాల్సిన పని లేదు..అలాంటి హీరోలని ఆహ్వానించినప్పుడు…వారికి ఎంత గౌరవం ఇవ్వాలి…కానీ ఇటీవల చిరంజీవి, మహేష్, ప్రభాస్‌లకు జగన్ ప్రభుత్వం ఆ గౌరవం ఇచ్చిందా? అంటే ఇవ్వలేదనే చెప్పాలి. అసలు వారిని పిలిచి అవమానించినట్లే చేశారు. కానీ తమ సమస్యల కోసం హీరోలు కాస్త తగ్గే ఉన్నారని చెప్పొచ్చు.

అయితే హీరోలని గౌరవించే విధానంలో తేడా తెలియడానికి కారణం…తాజాగా మంచి విష్ణుని ఆహ్వానించిన విధానం..విష్ణుని ఏకంగా ఇంటికి పిలిచి లంచ్ పెట్టి మరీ జగన్ పంపించారు. కానీ చిరంజీవి, ప్రభాస్, మహేష్ విషయంలో మాత్రం అలా చేయలేదు…పైగా వారి వెహికల్స్ గేటు బయటే ఆపేసి అక్కడ నుంచి నడిపించుకుంటూ వచ్చారు..అలాగే అధికారులతో మాట్లాడే కాన్ఫిరెన్స్ హాల్‌లో కూర్చోబెట్టి మాట్లాడించి…ఆరుబయట నిలబెట్టి మీడియా సమావేశం పెట్టారు.

కానీ విష్ణుని అలా కాదు..అంటే అసలు హీరోలని ఎలా ట్రీట్ చేశారో, బంధువైన విష్ణుని ఎలా ట్రీట్ చేశారో అందరికీ అర్ధమవుతుంది. హీరోలని అవమానించారనే విషయాన్ని మొన్నటివరకు ఏ హీరో ఫ్యాన్ పట్టించుకోలేదు..కానీ తాజాగా విష్ణుని ట్రీట్ చేసిన విధానాన్ని చూస్తే…చిరంజీవి, ప్రభాస్, మహేష్‌లని అవమానించినట్లే ఉన్నారని చెప్పొచ్చు. మొత్తానికి జగన్ ప్రభుత్వం..సినిమా వాళ్ళతో బాగానే రాజకీయం చేస్తుంది.

Discussion about this post