గత ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన జిల్లాల్లో ఇప్పుడు సీన్ మారుతుంది..నిదానంగా టీడీపీ లీడ్ లోకి వస్తుంది. గత ఎన్నికల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ హవానే నడిచింది. ఇక కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టిడిపికి ఆధిక్యం కనిపిస్తుంది. అదే సమయంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో టిడిపి పట్టు బిగిస్తుంది.

ఇదే క్రమంలో ఉమ్మడి విజయనగరంలో వైసీపీ హవా తగ్గి టిడిపికి పట్టు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో 9కి 9 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు పలు సీట్లలో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ సారి కొన్ని సీట్లలో టిడిపి గెలుపు కష్టమనే పరిస్తితి. అలా వైసీ బలం తగ్గిన స్థానాల్లో బొబ్బిలి ముందు ఉంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ సీటుని టిడిపి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

అటు అశోక్ గజపతి రాజు కంచుకోటగా ఉన్న విజయనగరంలో సైతం వైసీపీ హవా తగ్గుతుంది. ఇక్కడ టిడిపికి మంచి ఛాన్స్ ఉంది. అలాగే శృంగవరపుకోటలో మళ్ళీ టిడిపి పుంజుకుంది. అటు నెల్లిమర్ల సీటుని మళ్ళీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు పార్వతీపురంలో టిడిపికి లీడ్ కనిపిస్తుంది. అయితే గజపతినగరం, చీపురుపల్లి స్థానాల్లో బొత్స ప్రభావం వల్ల వైసీపీకి లీడ్ ఉంది.

అటు ఏజెన్సీ స్థానలైన సాలూరు, కురుపాం స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ లేదు..అలా అని టిడిపికి పాజిటివ్ లేదు. కాకపోతే టిడిపి నుంచి బలమైన నేతలు దిగితే ఏదొక సీటుని కైవసం చేసుకోవచ్చు. మొత్తానికి విజయనగరంలో టీడీపీకే లీడ్ కనిపిస్తుంది.
