వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే దాదాపు పొత్తు ఖాయమని చెప్పవచ్చు. ఆ దిశగానే చంద్రబాబు-పవన్ ముందుకెళుతున్నారు. అయితే పొత్తులో ఎవరికెన్ని సీట్లు వస్తాయనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ పొత్తుని చెడగొట్టాలని చూస్తున్న వైసీపీ మాత్రం..టిడిపి-జనసేన శ్రేణుల మధ్య ఏదొక విధంగా చిచ్చు పెట్టడానికి చూస్తుంది. టిడిపి, జనసేన కార్యకర్తల ముసుగులో ఉంటూ..ఏదొక అంశంలో చిచ్చు రాజేస్తుంది.

ఇంకా సీట్లు తేలలేదు..ఇంకా పదవులు విషయం ఇప్పుడే తేలే అంశం కాదు. కానీ పొత్తు ఉంటే పవన్‌కు సిఎం సీటు ఇవ్వాల్సిందే అని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. ఒకవేళ సిఎం సీటు ఇవ్వకపోతే పొత్తు ఉన్నా సరే..టీడీపీకి ఓటు వేయమని, తామంతా జగన్‌కు ఓటు వేస్తామని జనసేన శ్రేణులు చెబుతున్నట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇక జనసేనకు అంత సీన్ లేదని టిడిపి శ్రేణులు అన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య గొడవ పెట్టేలా రాజకీయం చేస్తున్నాయి.

అయితే వాస్తవాలు మాట్లాడుకుంటే..రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు బలమైన పార్టీలు..ఆ పార్టీలకు 40 శాతం పైనే ఓటు బ్యాంకు ఉంది. ఇటు జనసేనకు కాస్త బలం ఉంది..ఆ పార్టీకి దాదాపు 10 శాతం ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లతో 10 సీట్లు లోపు గెలుచుకోవచ్చు..అంతే తప్ప పెద్ద విజయం రాదు. కాకపోతే జనసేన ఓట్లు చీల్చి టిడిపికి నష్టం, వైసీపీకి లాభం చేస్తుంది. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఇప్పుడు పొత్తు లేకపోతే అదే జరుగుతుందని వైసీపీ ఆశలు పెట్టుకుంది.
అందుకే పొత్తు చెడగొట్టడానికి వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక వారి వలలో పడితే టిడిపి-జనసేన శ్రేణుల మధ్య గొడవ తప్పదు. చూడాలి మరి పొత్తు విషయం చివరికి ఏం అవుతుందో.