జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కువ వ్యతిరేకతని మూటగట్టుకున్న తొలి జిల్లా ఏదంటే..ఠక్కున ఉమ్మడి గుంటూరు జిల్లా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజధాని అమరావతిని దెబ్బతీశారు. మూడు రాజధానుల పేరుతో కొత్త రాజకీయానికి తెరతీశారు. దీంతో గుంటూరు ప్రజలు వైసీపీపై వ్యతిరేకతతో ఉన్నారు. పైగా సరైన అభివృద్ధి పనులు జరగడం లేదు. అలాగే వైసీపీ నేతల అక్రమాలు ఎక్కువయ్యాయని విమర్శలు ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో గుంటూరులో వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కదనే పరిస్తితి. కానీ వాస్తవానికి ఆ పరిస్తితి లేదు. ఇటీవల సర్వేల్లో జిల్లాలో వైసీపీ పర్లేదు అనే విధంగా సీట్లు గెలుచుకుంటుందని తేలింది. జిల్లాలో 17 సీట్లు ఉంటే టిడిపి 8, వైసీపీ 6 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. అంటే పోటాపోటి ఉంది. 3 స్థానాల్లో హోరాహోరీ ఉంది. కాకపోతే వైసీపీకి కాస్త పట్టు ఉండటానికి కారణం ఉంది. జనసేన వల్ల వైసీపీకి ప్లస్ అవుతుందని తేలింది.

గత ఎన్నికల్లో ఎలాగో ఓట్లు చీల్చి వైసీపీకి బెనిఫీట్ అయింది. లేటెస్ట్ సర్వేలో కూడా జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీకి 6 సీట్లలో గెలుపు అవకాశాలు వచ్చాయి. ఒక్కసారి వైసీపీ గెలిచే సీట్లు చూసుకుంటే…తెనాలి, గుంటూరు ఈస్ట్, నరసారావుపేట, పత్తిపాడు, పెదకూరపాడు, మాచర్ల..వీటిలో మాచర్ల, నరసారావుపేట. పక్కన పెడితే..మిగిలిన స్థానాల్లో జనసేన ప్రభావం ఉంది. ఆ స్థానాల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి నష్టం, వైసీపీకి లాభం జరుగుతుందని తెలుస్తోంది.
ఇక టఫ్ ఫైట్ ఉన్న గురజాల, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి స్థానాల్లో కూడా జనసేన ప్రభావం ఉంది. అంటే టిడిపి-జనసేన పొత్తు ఉంటే గుంటూరులో వైసీపీకి రెండు, మూడు సీట్లే దక్కుతాయి..లేదంటే వైసీపీకే ప్లస్.
