తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీలో సీట్లు దక్కించుకోవాలని పలువురు నేతలు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న కొందరు కీలక నేతలు సైతం టిడిపి సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉమ్మడి నెల్లూరులో టిడిపి బలం పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ సీట్ల కోసం డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా టిడిపికి గెలుపు అవకాశాలు ఉన్న కావలి, ఉదయగిరి సీట్లలో పోటీ ఎక్కువ నెలకొంది. ఈ సీట్ల కోసం డిమాండ్ ఎక్కువ ఉంది.
ఉదయగిరి సీటులో టిడిపి ఇంచార్జ్ గా బొల్లినేని వెంకట రామారావు ఉన్నారు..నెక్స్ట్ ఈయనే పోటీ చేయాలని చూస్తున్నారు. 2014లో గెలవగా, 2019లో ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎన్నికల్లో కూడా సీటు తనదే అంటున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం టిడిపిలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక అక్కడ ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్ సైతం ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల టిడిపికి 25 లక్షల విరాళం కూడా ఇచ్చారు. దీంతో ఉదయగిరి సీటుకు బాగా డిమాండ్ ఉంది. మరి చివరికి సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.

అటు టిడిపి గెలుపుకు మంచి అవకాశాలు ఉన్న కావలిలో కూడా ట్విస్ట్ లు ఉన్నాయి. ఇక్కడ బీదా రవిచంద్రయాదవ్ తో పాటు ఇంచార్జ్ సుబ్బానాయుడు ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహానాడులో టిడిపికి కోటి విరాళం ఇచ్చి..దగ్గుబాటి కృష్ణారెడ్డి సీటు రేసులోకి వచ్చారు.
ఈయన సైతం కావలి సీటు ఆశిస్తున్నారని తెలుస్తుంది. మరి చంద్రబాబు ఈ సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.