May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

గుంటూరు టీడీపీలో కన్ఫ్యూజన్..ఆ సీట్లలో నో క్లారిటీ.!

గత ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత  తెలుగుదేశం పార్టీ త్వరగా పికప్ అయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది..గుంటూరు పార్లమెంట్..ఇక్కడ త్వరగా టి‌డి‌పికి బలం చేకూరింది. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని హడావిడి చేయడం, రాజధాని అమరావతిని నాశనం చేసేలా నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు వైసీపీకి యాంటీ అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో టి‌డి‌పి బలం పెరిగింది.

అయితే టి‌డి‌పి బలం పెరిగినా సరే కొంత కన్ఫ్యూజన్ నడుస్తుంది. అసలు అక్కడ ఎవరు పోటీ చేస్తారనే క్లారిటీ రావడం లేదు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు సీట్లు ఉన్నాయి. గుంటూరు ఈస్ట్, వెస్ట్, తాడికొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క గుంటూరు వెస్ట్ మినహా మిగిలిన సీట్లు వైసీపీ గెల్లుచుకుంది. ఇప్పుడు అన్నీ సీట్లలో వైసీపీకి వ్యతిరేకత మొదలైంది.

కాకపోతే ఆయా సీట్లలో టి‌డి‌పికి సరైన నాయకులు లేరు. కరెక్ట్ గా పొన్నూరు, మంగళగిరి సీట్లే క్లారిటీగా ఉన్నాయి. మంగళగిరిలో లోకేష్, పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర పోటీ చేయడం ఖాయం..అలాగే గెలవడం డౌట్ లేదు.  అటు తెనాలిలో ఆలపాటి రాజా ఉన్నారు..కానీ జనసేనతో పొత్తు ఉంటే ఈ సీటులో నాదెండ్ల మనోహర్ పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పుడే ఈ సీటు క్లారిటీ వచ్చేలా లేదు. అటు ప్రత్తిపాడులో మాకినేని పెదరత్తయ్య ఉన్నారు…ఆయనకు సీటు దక్కుతుందనే గ్యారెంటీ లేదు. ఇటు తాడికొండలో శ్రావణ్ కుమార్ ఉన్నారు..కానీ ఈయనకు ఇంకా సీటు ఫిక్స్ చేయలేదు. గుంటూరు వెస్ట్ సీటు కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఇక ఎవరికి దక్కుతుందో తెలియదు. గుంటూరు ఈస్ట్ కూడా ఫిక్స్ కాలేదు. ఇలా అనుకూలంగా ఉన్న సీట్లే ఫిక్స్ చేయలేదు.