విశాఖ రాజధాని పేరుతో వైసీపీ ఎన్ని రాజకీయాలు చేసిన…అక్కడి ప్రజలు నమ్మడం లేదనే విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గాలిలో అక్కడ వైసీపీ హవా నడిచింది గాని..ఈ సారి అక్కడ వైసీపీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి షాక్ తప్పదనే పరిస్తితి. రాజధాని పెడుతున్నామని చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. దీంతో అక్కడ టిడిపికి పట్టు పెరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో టిడిపికి లీడ్ కనిపిస్తుంది.
అయితే ఇక్కడ టిడిపిలో సీట్ల విషయంలో కాస్త క్లారిటీ లేదు. కొన్ని సీట్లలో ఎవరు పోటీ చేస్తారో తెలియడం లేదు. టిడిపికి కంచుకోట అయిన విశాఖ సిటీలో నాలుగు సీట్లు ఉన్నాయి. అందులో విశాఖ ఈస్ట్ లో మళ్ళీ వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేయడం ఖాయమే. ఇక వెస్ట్ లో గణబాబు పోటీ చేస్తారు. అటు సౌత్ లో ఇంచార్జ్ గా గండి బాబ్జీ ఉన్నారు.. మరి ఆ సీటు ఆయనకే ఇస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఇటు విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు..మళ్ళీ ఈ సీటు గంటాకు దక్కడం కష్టమే..పొత్తు ఉంటే జనసేనకు దక్కవచ్చు అనే ప్రచారం ఉంది. గంటా సీటుపై క్లారిటీ లేదు.

అటు గాజువాకలో పల్లా శ్రీనివాస్ ఉన్నారు..మరి ఆయన అక్కడే పోటీ చేస్తారా? లేదా పొత్తులో ఈ సీటు జనసేనకు దక్కుతుందా? అనేది క్లారిటీ లేదు. ఇక భీమిలిలో కోరాడ రాజబాబు ఉన్నారు. ఈ సీటు క్లారిటీ లేదు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, చోడవరంలో కేఎస్ఎన్ రాజు, పెందుర్తిలో బండారు సత్యనారాయణ, పాయకరావుపేటలో వంగలపూడి అనిత, పాడేరులో గిడ్డి ఈశ్వరి పోటీ చేయడం ఖాయమే. అనకాపల్లిలో పీలా గోవింద్ ఉన్నారు..ఆయనకు సీటు ఫిక్స్ చేస్తారా? అనేది తెలియదు. అటు అరకు, ఎలమంచిలి సీట్లు క్లారిటీ లేదు.