నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి పోలిటికల్ కెరీర్ కాస్త కన్ఫ్యూజన్ లో ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆయన వైసీపీలోనే కొనసాగుతారా? లేక టీడీపీలోకి వస్తారా? అనేది క్లారిటీ లేదు. మొదట రాజకీయ జీవితం టీడీపీలోనే మొదలైంది..ఆ తర్వాత కాంగ్రెస్..మళ్ళీ టీడీపీ..2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళి..వెంకటగిరిలో పోటీ చేసి గెలిచారు.

అయితే ఆయనకు గెలిచిన ఆనందం లేదు..మంత్రి పదవి రాలేదు..నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదు. దీంతో వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు..అటు వెంకటగిరిలో వైసీపీ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు. నెక్స్ట్ ఆయనకు సీటు ఇస్తారని ప్రచారం ఉంది. దీంతో ఆనం టీడీపీలోకి వస్తారని పచారం జరుగుతుంది. టీడీపీలోకి వచ్చి..నెల్లూరు సిటీ నుంచి పోటీకి దిగుతారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆనం కుమార్తె కైవల్య రెడ్డి..టీడీపీలోకి వచ్చారు. ఆమె ఆత్మకూరు సీటు ఆశిస్తున్నారు. దాదాపు ఆ సీటు ఆమెకు ఫిక్స్ అవుతుందని అంటున్నారు.

ఇక ఆనం కూడా నెల్లూరు సిటీ సీటు ఇస్తే ఓకే లేదంటే టీడీపీలోకి వచ్చి పోటీ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. అక్కడ ఇంచార్జ్ గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు..ఆయనకు సీటు దక్కడం కష్టం. మాజీ మంత్రి నారాయణ మళ్ళీ పోటీకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆనంని తీసుకుని సిటీ సీటు ఇస్తే..జిల్లాలో టీడీపీకి కాస్త కలిసొస్తుంది.

ఉదయగిరి, వెంకటగిరి, ఆత్మకూరు లాంటి స్థానాల్లో టీడీపీకి ప్లస్ అవుతుంది. అయితే ఆనం నిర్ణయం ప్రస్తుతం తేలేలా లేదు. ప్రస్తుతం ఆనం కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చివరికి ఆనం ఎటువైపు వస్తారో చూడాలి.

Leave feedback about this