రాష్ట్రంలో ఈ సారి టీడీపీ గాలి వీచేలా ఉంది..వైసీపీపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చేలా ఉంది. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే..ఇంకా ఎక్కువ స్థాయిలో టిడిపి నేతలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే 2004 నుంచి కొందరు నేతలకు కలిసిరావడం లేదు..అనూహ్యంగా ఓటమి పాలవుతూ వస్తున్నారు. 2004, 2009లో కాంగ్రెస్ హవా ఉండటం వల్ల టిడిపి ఓటమి పాలైంది.

2014లో టిడిపి గెలిచి అధికారంలోకి వచ్చింది గాని..అనుకున్న మేర ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది. ఇక 2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయింది..ఈ క్రమంలో కొందరు నేతలు వరుస ఓటములు ఎదురయ్యాయి. అలా వరుసగా ఓడిపోతున్న నేతలు..ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. వరుస ఓటములకు బ్రేకులు వేయాలని చూస్తున్నారు. అలా వరుస ఓటములకు బ్రేకులు వేయాలని చూస్తున్న వారిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఎన్ని ఓటములు వచ్చిన టిడిపిలోనే ఉంటూ..బాబుకు విధేయుడుగా ఉన్న సోమిరెడ్డి..1994, 1999 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి గెలిచారు..కానీ 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. మధ్యలో బంపర్ ఆఫర్ అన్నట్లు 2012 కోవూరు ఉపఎన్నికలో కూడా ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయన 2024లో గెలవాలని చూస్తున్నారు. ప్రజలు కూడా కాస్త ఆయనపై సానుభూతితో ఉన్నారు.

ఇటు సోమిరెడ్డి తర్వాత వరుసగా ఓడుతున్న నేత పుత్తా నరసింహారెడ్డి..2004 నుంచి కమలాపురం బరిలో ఓడిపోతున్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి, 2009, 2014, 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వైసీపీ హవా ఉన్నా సరే పార్టీ మారకుండా పనిచేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరే కాదు..గత రెండు, మూడు ఎన్నికల్లో వరుసగా ఓడుతున్న టిడిపి నేతలు సైతం..ఈ సారి గెలవాలని పట్టుదలతో ఉన్నారు.