రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలని తగ్గించాలని ప్రతిపక్ష టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీనే కాదు….జనసేన, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు సైతం దీనిపై పోరాడుతున్నాయి. కేంద్రం ఎలాగో పెట్రోల్‌పై రూ.5 వ్యాట్, డీజిల్‌పై రూ.10 వ్యాట్ తగ్గించాయి. దీంతో రాష్ట్రంలో కూడ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో…తమ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాయి. కానీ ఏపీలోని జగన్ ప్రభుత్వం మాత్రం…ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించమని తెగేసి చెప్పేస్తుంది.

అసలు తాము రోడ్డు సెస్ కింద రూ.1 మాత్రమే పెంచామని అబద్దాలు చెప్పేస్తుంది. పైగా తాము వ్యాట్ పెంచలేదని చెప్పి, వ్యాట్ పెరుగుదలకు టీడీపీ, బీజేపీలే కారణమని మంత్రి కొడాలి నాని కవర్ డ్రైవ్‌లు వేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. అటు సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డి సబ్జెక్ట్‌ని డైవర్ట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. కేంద్రంలోనే బీజేపీనే పెంచుకుంటూ పోయిందని విమర్శిస్తున్నారు.

వాస్తవానికి కేంద్రం దారుణంగా వ్యాట్ పెంచుకుంటూ వెళ్లింది…అందుకే ఇప్పుడు కొంతవరకు తగ్గించింది. అలా అని జగన్ ప్రభుత్వం పెంచకుండా లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం…రూ.4 పెంచి, మళ్ళీ రూ.2 తగ్గించేసింది. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో రేట్ ఆఫ్ ట్యాక్స్ 31శాతం + రూ.2 పెట్రోల్‌పై, 22.25 శాతం + రూ.2 డీజిల్‌పై ఉండేది. అలా ఉండే ట్యాక్స్‌ని జగన్ అధికారంలోకి వచ్చాక తెలివిగా ఏం చేశారంటే…రూ.2 కలిపేసి.. పెట్రోల్‌పై 35.20 శాతం వ్యాట్, డీజిల్‌పై 27 శాతం వ్యాట్ పెంచింది.

అంటే శాతాలు ఉండటం వల్ల…పెట్రోల్, డీజిల్ మూల ధర పెరిగేకొద్దీ..ప్రజలపై భారం పెరుగుతుంది. అంటే పెట్రోల్, డీజిల్ మూల ధర పెరిగేకొద్దీ…ట్యాక్స్ పెరుగుతుంది. అదే రూ.2 ఉంటే స్తిరంగా అదే ట్యాక్స్ ఉంటుంది. కానీ అందులో జగన్ ప్రభుత్వం మాయ చేసేసింది. ఇక దీనికి రోడ్డు సెస్ రూపాయి అదనం. అంటే జగన్ ప్రభుత్వం ప్రజలని ఏ విధంగా మోసం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

Discussion about this post