తెలుగుదేశం పార్టీకి మొదట నుంచి అండగా ఉంటున్న జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి అని చెప్పవచ్చు. మొదట నుంచి ఈ జిల్లాలో టిడిపికి మంచి పట్టు ఉంది. దాదాపు అన్నీ ఎన్నికల్లో ఇక్కడ టిడిపి సత్తా చాటుతూనే వచ్చింది. కానీ గత ఎన్నికల్లోనే టిడిపి దెబ్బతింది. జిల్లాలో 15 సీట్లు ఉంటే టిడిపి 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వైసీపీకి 13 సీట్లు వచ్చాయి.
అయితే ఇక్కడ టిడిపికి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో కూడా వైసీపీ పాగా వేసింది. కొవ్వూరు, చింతలపూడి, నిడదవోలు, దెందులూరు, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, గోపాలాపురం లాంటి స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇక ఇప్పుడు ఆ స్థానాల్లో సీన్ రివర్స్ అవుతుంది. టిడిపి మళ్ళీ తన కంచుకోటలని తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇప్పటికే ఆయా స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఈ క్రమంలో టిడిపి బలపడుతూ వస్తుంది.

దీంతో ఈ సారి టిడిపి మళ్ళీ కంచుకోటల్లో పాగా వేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొవ్వూరు, దెందులూరు, తణుకు, నిడదవోలు లాంటి స్థానాల్లో టిడిపి లీడ్ లోకి వచ్చింది. గోపాలాపురం, చింతలపూడి లాంటి స్థానాల్లో ఇంకొంచెం పికప్ అవ్వాలి. ఎలాగో పాలకొల్లు, ఉండి స్థానాల్లో టిడిపికి తిరుగు లేదు. ఇక పోలవరంలో టిడిపి బలపడుతుంది.
అయితే ఏలూరు, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం లాంటి స్థానాల్లో టిడిపి బలంగానే ఉంది..కానీ ఆయా స్థానాల్లో జనసేన ప్రభావం ఉంది. దాని వల్ల జనసేనతో పొత్తు ఉంటే ఆ సీట్లలో సత్తా చాటవచ్చు..లేదంటే టిడిపి ఆయా సీట్లలో గెలవడం కష్టమే. కానీ ఏదేమైనా వెస్ట్ లో టిడిపి మళ్ళీ పికప్ అయింది.