ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కనిగిరి గురించి చెప్పుకోవాల్సిందే. గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి దారుణంగా ఓడిపోయింది. అలాంటి పరిస్తితి నుంచి ఇప్పుడు ఆధిక్యంలోకి టిడిపి వచ్చింది. మొదట నుంచి కనిగిరిలో టిడిపి అప్పుడప్పుడు మాత్రమే మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. 1983, 1985, 1994 ఎన్నికల్లో గెలవగా..ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచింది.
2014 ఎన్నికల్లో బాలయ్య స్నేహితుడు కదిరి బాబూరావు టిడిపి నుంచి గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచాక ఈయన ప్రజా వ్యతిరేకత ఎక్కువ తెచ్చుకున్నారు. దీంతో చంద్రబాబు సీట్లు మార్చారు. 2019 ఎన్నికల్లో కదిరిని దర్శికి పంపారు. ఇక కనిగిరిలో కాంగ్రెస్ నుంచి ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని నిలబెట్టారు. అయితే వైసీపీ వేవ్ లో ఇద్దరు పోయారు. ఓడిపోయాక కదిరి వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఆవిషయం పక్కన పెడితే..కనిగిరిలో ఓడిపోయిన దగ్గర నుంచి ఉగ్ర కష్టపడి పనిచేస్తూ వస్తున్నారు.

మళ్ళీ టిడిపిని బలోపేతం చేసే దిశగా ఆయన పనిచేస్తున్నారు. ఇక ఇటు వైసీపీ నుంచి గెలిచిన బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రజల్లో ఉండటం తక్కువ, ప్రజా సమస్యలని పట్టించుకునేది లేదు..అలాగే నియోజకవర్గంలో అక్రమాలు పెరిగాయనే ఆరోపణలు వచ్చాయి. పరిస్తితి ఎలా వచ్చిందంటే సొంత పార్టీ వాళ్ళే బుర్రాని వ్యతిరేకించే పరిస్తితి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా సర్వేల్లో బుర్రా మళ్ళీ నిలబడితే ఓడిపోవడం ఖాయమని తేలింది.
ఇటు టిడిపికి విజయావకాశాలు మెరుగుపడ్డాయి. గత ఎన్నికల్లో 40 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయినా సరే..ఇప్పుడు టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది..అంటే వైసీపీపై వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ సారి కనిగిరిలో ఉగ్ర గెలుపు దిశగా వెళుతున్నారు.
