May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

పశ్చిమ ప్రకాశంలో సైకిల్ జోరు..3 సీట్లు ఖాయమే.!

పశ్చిమ ప్రకాశం ప్రాంతం..మొన్నటివరకు టి‌డి‌పి పేరు పెద్దగా వినబడని ప్రాంతం..ఏదో పార్టీ ఉన్నా సరే..అక్కడ గెలవడం అనేది పెద్దగా జరగదు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు సీన్ మారింది. అసలు పశ్చిమ ప్రకాశంలో ఐదు స్థానాలు ఉన్నాయి..మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, యర్రగొండపాలెం స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో దర్శి, కనిగిరి స్థానాల్లో టి‌డి‌పి గెలవగా, మిగిలిన మూడు స్థానాల్లో వైసీపీ గెలిచింది.

ఇక 2019 ఎన్నికల్లో ఐదు స్థానాల్లో వైసీపీ గెలిచింది. అయితే రెడ్డి, ఎస్సీ వర్గాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆయా స్థానాల్లో వైసీపీకి పట్టు ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది..ఇప్పటికే ఆయా స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..ఇటు టి‌డి‌పి బలపడుతుంది. ఇదే సమయంలో చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ కంచుకోటలైన గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం స్థానాల్లో పర్యటించారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఆ మూడు స్థానాల్లో బాబు పర్యటనకు ప్రజా మద్ధతు వచ్చింది. మార్కాపురంలో ఊహించని విధంగా జనం వచ్చారు. ఇక గిద్దలూరులో భారీగా జనం వచ్చారు. యర్రగొండపాలెం రోడ్ షోకు ఊహించని స్పందన వచ్చింది. మంత్రి సురేశ్ కాస్త హడావిడి చేసిన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.  

ఇలా బాబు పర్యటనతో పశ్చిమ ప్రకాశంలో టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చింది. ఈ సారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దర్శి, కనిగిరి స్థానాల్లో టి‌డి‌పికి తిరుగులేదనే పరిస్తితి. ఇక గిద్దలూరు, మార్కాపురం స్థానాల్లో టి‌డి‌పికి పట్టు పెరిగింది. యర్రగొండపాలెం స్థానంలో టి‌డి‌పి బలపడింది కానీ..అక్కడ ఇంకా వైసీపీ బలంగా ఉంది. అయితే టి‌డి‌పి నేతలు కష్టపడితే…ఐదు స్థానాల్లో గెలుపు సులువే. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఖచ్చితంగా 3 స్థానాల్లో గెలవడం పక్కా అని చెప్పవచ్చు.