వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ పరిస్తితిపై అనూహ్యంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉంది? ఎన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుం ది? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2014లో వందకు పైగా అంటే.. 105 స్థానాల్లో పార్టీ విజయం దక్కించుకుంది. అధికారంలోకి వచ్చింది.

అయితే.. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ వంటి నియోజకవర్గాలు సహా.. రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకులు లేకుండా పోయారనేది వాస్తవం. దీంతో ఆయా నియోజకవ ర్గాలను అసలు లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి.. అంచనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తే.. ఎన్నిచోట్ల గెలిచే అవకాశం ఉందని… మేధావులు దృష్టి పెడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని.. ముందుకు సాగాలని.. టీడీపీ భావిస్తోంది.

కానీ, ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో 15కు పైగా జిల్లాల నాయకులు ఇష్టపడడం లేదు. ఇక, చంద్రబాబుకు ఎంతో నమ్మకంగా ఉండే… ఎన్నారై.. టీడీపీ విభాగాల నాయకులు కూడా తాజాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిపోరు చేయడమే బెటర్ అని..అవసరమైతే.. తాము మద్దతుగా వచ్చి ప్రచారం చేస్తామని.. కోమటి జయరాం(ప్రస్తుతం అమెరికాలో టీడీపీ బాధ్యతలు తీసుకున్నారు) వంటివారు చంద్రబాబుకు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఒంటరిగా నిలిస్తే.. ఎన్నిచోట్ల విజయం దక్కించుకుంటుంది? అనేది ఆసక్తిగా మారింది.

ఇప్పటికిప్పుడు ఉన్న అంచనాల మేరకు .. పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమం చేస్తే.. జిల్లాలను ఎంచుకుని పార్టీ కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వస్తోంది. ఆయా నగరాలు.. జిల్లాల్లో నాయకుల పరిస్థితి..మూడ్‌ను బట్టి.. పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిలో విజయవాడ, విశాఖ, రాజమండ్రి, అనంతపురం వంటి ప్రాంతాలనే ఎంచుకుంటున్నారు. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా కార్యక్రమాలు పెద్దగా సాగడం లేదు. దీనిని బట్టి.. దాదాపు 100 నియోజకవర్గాల్లో సైకిల్‌ను రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post