గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం…టీడీపీకి కంచుకోట…మొదట నుంచి ఇక్కడ టీడీపీ హవా నడుస్తూనే వస్తుంది. అయితే 2004, 2009 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. మళ్ళీ 2014లో గెలిచిన, 2019 ఎన్నికల్లో వైసీపీ చేతులో ఓడిపోయింది. వైసీపీ తరుపున మేకతోటి సుచరిత గెలిచి..హోమ్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక ఈ రెండున్నర ఏళ్లలో సుచరిత పనితీరుకు పెద్దగా మంచి మార్కులు ఏమి పడటం లేదు. అటు మంత్రిగా అయినా, ఇటు ఎమ్మెల్యేగా అయినా సరే అనుకున్న స్థాయిలో మార్కులు పడటం లేదు.

పైగా రాజధాని అమరావతి అంశం సుచరితకు బాగా మైనస్ అవుతుంది. దీంతో ప్రత్తిపాడులో టీడీపీకి పికప్ అవ్వడానికి మంచి అవకాశం దొరికింది. అలాగే నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కాకపోతే పార్టీని నడిపించే నాయకుడు సరిగా లేరు. గత రెండు ఎన్నికల నుంచి అభ్యర్ధులని మార్చుకుంటూనే వస్తున్నారు. 2014లో రావెల కిషోర్ బాబు టీడీపీ నుంచి గెలిచిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల ముందు ఈయన జనసేనలోకి వెళ్ళి పోటీ చేశారు.

దీంతో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని టీడీపీ తరుపున బరిలో దింపారు. కానీ జగన్ గాలిలో సుచరిత గెలిచారు. ఎన్నికలయ్యాక డొక్కా సైతం టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. దీంతో సీనియర్ నేత మాకినేని పెద్ద రత్తయ్యనే మళ్ళీ ఇంచార్జ్‌గా పెట్టారు. వయసు మీద పడటంతో ఈయన అంతగా యాక్టివ్‌గా పనిచేయడం లేదు. అయితే ప్రత్తిపాడు సీటు కోసం…మాజీ ఐఏఎస్ రామాంజనేయులు, అలాగే కందుకూరి వీరయ్య, మాజీ జెడ్పీ ఛైర్మన్ కూచిపూడి విజయలు ప్రత్తిపాడు సీటు కోసం ట్రై చేస్తున్నారు.

అటు తాడికొండ ఇంచార్జ్‌గా ఉన్న తెనాలి శ్రావణ్ కుమార్‌ని…నెక్స్ట్ ఎన్నికల్లో తాడికొండ బరిలో వైసీపీ తరుపున నిలబెట్టే క్యాండిడేట్ బట్టి మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అవసరమైతే ప్రత్తిపాడులో శ్రావణ్‌ని నిలబెట్టవచ్చని తెలుస్తోంది. అయితే ఇప్పుడే బలమైన అభ్యర్ధిని నిలబెడితే ప్రత్తిపాడుని ఈజీగా గెలుచుకోవచ్చు. లేదంటే మళ్ళీ గెలుపు కష్టమవుతుంది.

Discussion about this post