ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్న రాజకీయం కాస్త..ఇప్పుడు మారుతూ వస్తుంది. అయితే వైసీపీ బలం పెద్దగా తగ్గిపోయిందని చెప్పలేం గానీ, కొంతవరకు మాత్రం వైసీపీ బలం తగ్గిందనే తెలుస్తోంది. కోస్తా జిల్లాల్లో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా వెలువడిన మినీ మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలని బట్టి చూస్తే….వైసీపీ ఆధిక్యం ఉన్నా సరే కాస్త బలం తగ్గిందని అర్ధమవుతుంది. అలాగే టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది.

ముఖ్యంగా ఐదు జిల్లాల్లో అనుహ్యా మార్పు వచ్చింది…ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువ మార్పు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది..అటు గుంటూరులో దాచేపల్లి మున్సిపాలిటీలో టీడీపీ-జనసేనలు కలిసి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చాయి. అలాగే గుంటూరు కార్పొరేషన్ 6వ డివిజన్‌లో టీడీపీ సత్తా చాటింది.

ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ 6వ డివిజన్‌లో వైసీపీ గెలిచింది…కానీ ఇప్పుడు టీడీపీ గెలిచింది. అలాగే వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇటు కృష్ణా జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. జగ్గయ్యపేటని కూడా కైవసం చేసుకునేది…కానీ కొన్ని వార్డుల్లో ఫలితాలు తారుమారు చేసి వైసీపీ గెలిచిందని ఆరోపణలు వచ్చాయి. అంటే జగ్గయ్యపేటలో నైతిక విజయం టీడీపీదే. ఇక పెడన జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు మున్సిపాలిటీలో టీడీపీ-జనసేనలు…వైసీపీకి టఫ్ ఫైట్ ఇచ్చాయి. తూర్పు గోదావరిలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలిసి….వైసీపీని డామినేట్ చేశాయి. అంటే ఈ ఐదు జిల్లాల్లో కీలక మార్పు మాత్రం వచ్చిందని తెలుస్తోంది. టీడీపీ పుంజుకుంది. టీడీపీతో గానీ పవన్ కల్యాణ్ కలిస్తే ఇంకా తిరుగుండదని తెలుస్తోంది. వైసీపీకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది.

Discussion about this post