కృష్ణా జిల్లా బోర్డర్‌లో ఉండే కైకలూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు నిదానంగా మారుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గంలో సీన్ మారుతుంది. వైసీపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, టీడీపీకి మంచి అవకాశం దొరుకుతుంది. అయితే కైకలూరు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీకి అనుకూలంగానే ఉంది. 2009లో ఇక్కడ టీడీపీ గెలవగా, 2014లో టీడీపీ మద్ధతుతో బీజేపీ గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది…టీడీపీ-జనసేనలు విడిగా పోటీ చేయడం, జగన్ వేవ్ ఉండటంతో కైకలూరులో వైసీపీ గెలిచింది.

వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు విజయం సాధించారు…అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తక్కువ సమయంలోనే దూలం ఓ రికార్డు కొట్టారు…అది ఏంటంటే తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకతే కాదు…సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. సరే ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు, వైసీపీ ఎమ్మెల్యేలని వ్యతిరేకించవచ్చు…కానీ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ఎమ్మెల్యే తీరుని ఎండగడుతున్నారు. ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని బహిరంగంగా మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శిస్తున్నారు.

ఒకవేళ ప్రతిపక్షం విమర్శలు చేస్తే ఏదో రాజకీయం అనుకోవచ్చు. ఇక సొంత పార్టీ వాళ్లే విమర్శలు చేస్తున్నారంటే..ఏం అనుకోవాలో చెప్పాల్సిన పని లేదు. దీంతో ప్రజల్లో కూడా దూలంపై నెగిటివ్ వచ్చింది. ఎలాగో అభివృద్ధి పనులు చేసేది ఏమి లేదు..పైగా ప్రజలకు టచ్‌లో ఉండేది తక్కువ. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ కైకలూరులో దూలం గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇక్కడ టీడీపీ బలపడటానికి మంచి ఛాన్స్ ఉంది…కానీ ఇక్కడ టీడీపీలో కాస్త క్లారిటీ మిస్ అవుతుంది. ఉండటానికి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఉన్నారు…కానీ ఆయనకు సీటు ఫిక్స్ అయినట్లు చెప్పడం లేదు. వేరే నాయకుడుకు బాధ్యతలు ఇవ్వడం లేదు. మరి పొత్తు ఉంటే జనసేనకు ఇవ్వడానికి ఈ సీటు ఆపారు అని అనుకోవచ్చు.

Discussion about this post