ఏపీలో మంత్రుల పనితీరు అంతంత మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. పేరుకు మంత్రులుగా ఉంటున్నారు గాని వారి వారి శాఖలపై పట్టు తెచ్చుకుని, అభివృద్ధి పనులు చేయడం తక్కువ. ఎంతసేపటికి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్‌లని తిట్టడమే మంత్రుల పనిగా ఉంది. దీని వల్ల చాలామంది మంత్రులపై వ్యతిరేకత కనిపిస్తుంది. పైగా చాలామంది ప్రజలకు కొంతమంది మంత్రులనే సంగతి తెలియదు.

అంటే మంత్రుల పరిస్తితి అలా ఉంది. ఇదే క్రమంలో గోదావరి జిల్లాల్లో ఉన్న మంత్రుల పనితీరు మెరుగ్గా లేదని తెలుస్తోంది. అలాగే వారి వారి స్థానాల్లో సరిగా పనిచేయకపోవడం వల్ల వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ..విచిత్రమైన విషయం ఏంటంటే హోమ్ మంత్రిగా ఉన్న వనిత..పెద్దగా ప్రజలకు తెలియకపోవడం..అటు మిగతా మంత్రుల పరిస్తితి కూడా అంతే. ఈ ముగ్గురు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్ అయితే..ఈ ముగ్గురు గెలవడం దాదాపు కష్టమే.

అటు ఉమ్మడి తూర్పు గోదావరిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. చెల్లుబోయిన వేణుగోపాల్, విశ్వరూప్, దాడిశెట్టి రాజా..ఈ ముగ్గురు పనితీరు కూడా పెద్దగా బాగున్నట్లు కనిపించడం లేదు. ఆశలు వీరు ఏ ఏ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మెజారిటీ ప్రజలకు తెలియదు. అలాగే వీరిలో వేణు, విశ్వరూప్‌లు డేంజర్ జోన్ లో ఉన్నారు. పొత్తు ఉంటే ఈ ఇద్దరు గెలవడం కష్టమే.

కొద్దో గొప్పో రాజా పరిస్తితి మెరుగ్గా ఉంది. అది కూడా తునిలో టిడిపి కాస్త వీక్ గా ఉండటం రాజాకు ప్లస్ అవుతుంది. అక్కడ టిడిపి బలపడితే రాజా కూడా డేంజర్ జోన్ లోకి వెళ్ళాల్సిందే.
