ఏపీ రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి…స్పీకర్లుగా పనిచేసిన వారు మళ్ళీ గెలవరని, అదేవిధంగా మంత్రులుగా పనిచేసేవారు సైతం మెజారిటీ స్థాయిలో ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ సెంటిమెంట్ వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగుతుందనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో టిడిపి హయాంలో పనిచేసిన మంత్రులు, స్పీకర్ సైతం ఓటమి పాలయ్యారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. అటు మంత్రులు దాదాపు ఓడిపోగా, ముగ్గురు మాత్రమే మళ్ళీ గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మాత్రం మళ్ళీ గెలిచారు.

ఇప్పుడు ఏపీలో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం 25 మంత్రులు ఉన్నారు..వారు మళ్ళీ గెలవడం డౌటే అని ప్రచారం జరుగుతుంది. పైగా తాజాగా ఐప్యాక్ సర్వే లీక్ అయిందని, సోషల్ మీడియాలో ఓ రిపోర్టు బయటకొచ్చింది. ఆ సర్వే ప్రకారం 25 మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని, 5 గురు మాత్రమే మళ్ళీ గెలుస్తారని తేలింది. పుంగనూరులో పెద్దిరెడ్డి, జీడీనెల్లూరులో నారాయణస్వామి, కడపలో అంజాద్ బాషా, తునిలో దాడిశెట్టి రాజా, అమలాపురంలో విశ్వరూప్ మాత్రమే మళ్ళీ గెలుస్తారని ఆ సర్వేలో తేలింది. అంతకముందు మంత్రులుగా పనిచేసి మధ్యలోనే పదవులు కోల్పోయిన మాజీ మంత్రుల్లో సైతం ఇద్దరు మాత్రమే మళ్ళీ గెలుస్తారని సర్వేలో తేలింది. కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్‌లు మాత్రమే మళ్ళీ గెలుస్తారని సర్వేలో వచ్చింది.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వేలో నిజమెంత ఉందో తెలియదు గాని..నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం కొందరు మంత్రులు గెలవడం కష్టమే అంటున్నారు. పైగా టీడీపీ-జనసేన పొత్తు సెట్ అయితే మెజారిటీ మంత్రులకు ఓటమి తప్పదని చెబుతున్నారు.