దేశవ్యాప్తంగా సంచనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీగ లాగితే డొంక కదిలినట్టు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. మొన్నటికి మొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిసినదే .

ఈ కేసులో తాజాగా ఊహించినట్లుగానే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం విచారణ పేరిట హెడ్క్వార్టర్స్కు పిలిపించుకున్న సీబీఐ.. సుమారు ఎనిమిది గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది. ఆపై ఆయన అరెస్ట్ను ప్రకటించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన వ్యవహారంలో సిసోడియాదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న దర్యాప్తు సంస్థ.. ఏ1 నిందితుడిగా ఆయన పేరు ప్రకటించింది. లిక్కర్ పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు అప్పగించారని అభియోగాలు ఆయనపై నమోదు చేసింది. బ్యూరోక్రాట్స్ స్టేట్మెంట్ ఆధారంగానే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది సీబీఐ. సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా సీబీఐ కార్యాలయం వద్ద 144 సెక్షన్ ను విధించారు. సుమారు 8 గంటలపాటు సిసోడియాను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో ఆయన్ని అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎఫ్ఎస్ఐఆర్ పేర్కొన్న దినేశ్ అరోడా, ఇతర నిందితులతో గల సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. పలు సందర్భాల్లో చేసిన ఫోన్ కాల్స్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. అయితే, మనీశ్ సిసోడియా వివరణలతో తృప్తి చెందని సీబీఐ అధికారులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని, కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతోనే అరెస్టు చేశామని అంటున్నారు. కీలకమైన సమాచారం సిసోడియా నుంచి రాబట్టాలంటే కస్టోడియల్ విచారణ అవసరమని అన్నారు.ఆయన్ని కోర్టు ముందు హాజరు పరిచి.. సీబీఐ కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2021 మద్యం పాలసీ రూపకల్పనలో.. మద్యం కంపెనీల ప్రమేయం ఉందని సీబీఐ చెబుతోంది. “సౌత్ గ్రూప్” అనే పేరిట లిక్కర్ లాబీయింగ్ నడిచిందని.. రూ. 100 కోట్ల డబ్బు చేతులు మారాయని వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పై సామాజిక మాధ్యమాల్లో vedios మరియు Memes చేస్తూ ఇక దొర బిడ్డ జైలు కే !! అంటూ విమర్శలు కురిపిస్తున్నారు . ఇంకా కొన్ని రోజులు గడిస్తే కానీ అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని BRS పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు…..
