మంత్రి కొడాలి నాని అనే పేరు వినగానే…అందరికీ గుర్తొచ్చేది ఆయన మాట్లాడే బూతులు మాత్రమే…ఎందుకంటే ఆయన పేరుకు మంత్రిగా ఉన్నారు గాని…ఆయన ఏ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో…అసలు ఆయన శాఖకు సంబంధించి ఏ పనులు చేస్తున్నారో ఆంధ్రాలో ఉండే ప్రజలకు ఏ మాత్రం క్లారిటీ లేదనే చెప్పాలి..ఎందుకంటే ఆయన ఎప్పుడు మీడియా సమావేశం పెట్టిన కూడా…తన శాఖకు సంబంధించిన అంశాలని ఎప్పుడు మాట్లాడారు…ఇక ఎప్పుడు చంద్రబాబుని బూతులు తిట్టడమే పనిగా పెట్టుకుని ముందుకెళ్తారు.

అందుకే కొడాలి నాని ఏ శాఖకు మంత్రి అనేది ఎవరికి తెలియదు…ఇప్పుడు ఇదే అంశాన్ని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా లేవనెత్తుతున్నారు. అసలు కొడాలి ఎప్పుడైనా తన శాఖకు సంబంధించి మాట్లాడారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…గతంలో దేవినేని ఉమా ఎప్పుడు నానిపై విమర్శలు చేశారు గాని, ఆయనని ఎప్పుడు దారుణంగా తిట్టలేదు. కానీ తాజాగా దేవినేని ఉమా కూడా నానిపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ రేంజ్‌లో నానిని తిట్టారు.

ఎందుకంటే నాని ఎప్పుడు పడితే అప్పుడు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబుని బూతులు తిడుతున్నారు…ఇక ఇటీవల కాలంలో ఆ బూతులు బాగా ఎక్కువైపోయాయి…అయితే దేవినేని ఉమా..వ్యక్తిగత ఇబ్బదులు వల్ల గత నెల రోజులుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు…కానీ ఉమా తాజాగా యాక్టివ్ అయ్యారు…అలాగే అశోక్ బాబు అరెస్ట్ విషయంలో గట్టిగా పోరాడారు. ఈ క్రమంలోనే ఉమా..కొడాలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

2024 తర్వాత అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలికి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు…పదవులు శాశ్వతం కాదని, 2024లో తమ సత్తా ఏంటో చూస్తారని ఉమా ఫైర్ అయిపోయారు. అయితే ఉమా ఈ స్థాయిలో ఫైర్ అయిన సందర్భాలు లేవు…మరి ఇప్పుడే ఆయన కొడాలిపై విరుచుకుపడ్డారు. అలాగే ఆయనకు గుడివాడలో చెక్ పెడతామని అంటున్నారు. మరి చూడాలి గుడివాడలో కొడాలికి చెక్ పెట్టగలరో లేదో?

Discussion about this post