రాజకీయాల్లో అదృష్టం ఎప్పుడు పడితే అప్పుడు తలుపు తట్టదు…ఇక అదృష్టం తలుపు తట్టినప్పుడు…దాన్ని నిలుపుకోవాలి…అలా కాకుండా ఉంటే అదృష్టమే రివర్స్ అయ్యి…దురదృష్టంగా మారుతుంది…ఇప్పుడు ఏపీలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలని దురదృష్టం వెంటాడేలా ఉంది…ఎందుకంటే గత ఎన్నికల్లో చాలామంది కేవలం జగన్ గాలిలో ఎమ్మెల్యేలుగా గెలిచేశారు..ప్రజలు జగన్ ని చూసి ఓటేయడంతో అదృష్టం కొద్ది కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలా అదృష్టం కొద్ది గెలిచినప్పుడు…ఆ అదృష్టాన్ని నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి.

అంటే ప్రజలకు మరింత దగ్గరయ్యే పనులు చేయాలి..అలా కాకుండా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు దూరమయ్యే పనులు చేశారు…అందుకే మూడేళ్లలోనే చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరిస్తితి కూడా ఇంతే…రావడానికి రాజకీయాల్లోకి ఎప్పుడో వచ్చారు…కానీ విజయం మాత్రం 2019లోనే దక్కింది…అది కూడా తన చిరకాల ప్రత్యర్ధి దేవినేని ఉమాపై గెలిచారు. అంటే జగన్ గాలిలో వసంత విజయం సాధించేశారు.అలా గాలిలో గెలిచినప్పుడు…చాలా జాగ్రత్తగా ప్రజలకు పనులు చేయాలి…సొంత బలాన్ని పెంచుకోవాలి…ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలి…కానీ వసంత అలా చేయలేదు. మైలవరంలో ఈయన చేసిన అభివృధ్ధి శూన్యం…ఏదో పథకాలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. దానికి తోడు మైలవరంలో వసంత చేసే అక్రమాలకు లెక్క లేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి…అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలు…ఇలా చెప్పుకుంటూ పోతే వసంత చాలానే చేస్తున్నారని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే బంధువులు కూడా అదే పనిలో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ప్రజలకు సరిగ్గా పనులు చేయకపోవడం, అక్రమాలకు పాల్పడటం లాంటి అంశాలు వసంతకు మళ్ళీ గెలిచే అవకాశాలు దూరం చేస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ దేవినేని ఉమా…నిత్యం ప్రజల్లో ఉంటూనే పోరాటం చేస్తున్నారు..ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు…అమరావతి కోసం నిలబడ్డారు…ఇలా ఉమా ప్రజలకు దగ్గరయ్యే పనులు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ సారి వసంతకు దేవినేని గెలిచే ఛాన్స్ ఇచ్చేలా లేరు.
Discussion about this post