అధికార వైసీపీలో అప్పుడప్పుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు కొత్త కొత్త ట్విస్ట్‌లు ఇస్తున్నారు. అసలు ఈయన రాజకీయం ఏంటి అనేది క్లారిటీ లేకుండా పోతుంది. వైసీపీ మేలు కోసం పనిచేస్తున్నారో లేక వైసీపీని ముంచాలని పనిచేస్తున్నారో తెలియట్లేదని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ రాజధానుల నిర్ణయం ముగియలేదు..చివరికి రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్తితి.

అది పక్కన పెడితే ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు..విశాఖని రాజధానిగా చేయాలని పోరాటాలు చేస్తున్నారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉండి కూడా పోరాటం అనేది వారి రాజకీయం. ఇక ఇందులో ధర్మాన ఎప్పుడు ముందు ఊంటున్నారు. ఈయన పదే పదే విశాఖని రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు విశాఖని రాజధాని కాకుండా అడ్డుకుంటున్నారని అంటున్నారు. ఇక పేరుకు మూడు గాని..అసలు రాజధాని విశాఖ అని చెప్పి ఆ మధ్య బాంబు పేల్చారు.

ఇక తాజాగా మరో బాంబు పేల్చారు..విశాఖని రాజధానిగా చేయకపోతే..ఉత్తరాంధ్రని సెపరేట్ రాష్ట్రంగా చేసి..అప్పుడు విశాఖని రాజధానిగా చేయాలని అంటున్నారు. ఈయన డిమాండ్‌కు అర్ధం ఉందో లేదో జనాలే ఆలోచించాలి. ఈయన డిమాండ్‌తో రాయలసీమని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. ధర్మాన ప్రత్యేక రాష్ట్రం నినాదం పెద్ద వివాదమైంది.

అయితే ఉత్తరాంధ్ర వెనుకబడిందని, విశాఖని రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర జనం పొద్దునే భోజనం చేసి..రాజధానికి వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తారని అంటున్నారు. ఇక ఇక్కడ ధర్మాన కొన్ని లాజిక్‌లు మిస్ అవుతున్నారు. ఇప్పుడే కాదు..కాంగ్రెస్ హయాంలో కూడా ధర్మాన మంత్రిగా ఉన్నారు..మరి అప్పుడు వెనుకబడిన ఉత్తరాంధ్రని ధర్మాన అభివృద్ధి చేయలేకపోయారు. ఇక పొద్దున రాజధానికి వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తానని అంటున్నారు. మరి దక్షిణాంధ్ర, రాయలసీమ వాళ్ళ పరిస్తితి ఏంటి?మొత్తానికి ధర్మాన వ్యాఖ్యలు వైసీపీకే ఇబ్బంది అయ్యేలా ఉన్నాయి.
