జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల ఆమోదం ఎంత ఉందో తెలియదు గాని…తమని ప్రజలు గెలిపించారు కాబట్టి..అదే ప్రజా ఆమోదం అని వైసీపీ ముందుకెళ్లింది. కానీ టీడీపీ, ఇతర పార్టీలు, అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని పోరాటం చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం జరుగుతుంది. దీంతో మూడు రాజధానులు ముందుకెళ్లలేదు…ఇటు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయడం లేదు. చివరికి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది చెప్పుకోవడానికి లేదు.

సరే ఆ విషయం పక్కన పెడితే..విశాఖని రాజధానిగా చేయాలని అధికారంలో ఉన్న వైసీపీ నేతలే పోరాటం చేయడం విశేషం. అందులో మంత్రి ధర్మాన ప్రసాదరావు పదే పదే విశాఖ రాజధాని తెరపైకి తెస్తున్నారు. ఒకవేళ విశాఖని రాజధాని చేయకపోతే ఉత్తరాంధ్రని ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ చంద్రబాబు అధికారంలోకి వస్తే..అప్పుడు అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారని, అమరావతిలోనే పెట్టుబడులు పెడతారని, కాబట్టి ఉత్తరాంధ్రని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా కూడా అదే డిమాండ్ చేశారు. అయితే ధర్మాన ఇలా ప్రత్యేక రాష్ట్రం అంటున్నా వైసీపీ అధిష్టానం స్పందించడం లేదు. అంటే ధర్మాన వెనుక వైసీపీ అధిష్టానం ఉందా? అని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్నీ ప్రాంతాలని అభివృద్ధి చేస్తారని, అమరావతిని రాజధానిగా ఉంచుతారని అంటున్నారు. ఇంతకాలం వైసీపీ మూడు రాజధానులు అని హడావిడి చేసి రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పైగా అనేక ఏళ్ళు ధర్మాన, బొత్స లాంటి వారు ఉత్తరాంధ్రలో మంత్రులుగా ఉన్నారు..మరి మంత్రులుగా ఉంటూ ఉత్తరాంధ్రని ఎందుకు అభివృద్ధి చేయలేదని, ఇప్పటికీ వెనుకబడిందని ఎలా రాజకీయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ధర్మాన సెపరేట్ స్టేట్ కాన్సెప్ట్ వెనుక రాజకీయ కోణం ఉందని అంటున్నారు.
